Teach the anti-progressives a lesson: ప్రగతి నిరోధకులకు గుణపాఠం చెప్పండి
-- ఎన్నికల ప్రచారంలో BRS పార్టీ నల్లగొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రగతి నిరోధకులకు గుణపాఠం చెప్పండి
— ఎన్నికల ప్రచారంలో BRS పార్టీ నల్లగొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: ప్రగతి విరోధకులకు ఈ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణా ప్రజలు సన్నద్ధమౌతున్నారని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. అధికారాన్ని అనుభవించినంత సేపు అనుభవించి ఎన్నికల సమయంలో ప్రగతి విరోదకుల చెంతకు చేరిన వారిని ( Those who have enjoyed power for as long as they have enjoyed it and have joined the ranks of the opponents of progress during elections) ప్రజలు ఎవగించుకుంటున్నారన్నారు. నల్లగొండ పట్టణంలోని 30,29,31 వార్డులలో జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మహిళలు గుక్కెడు నీళ్ల కోసం కోసేడు దూరం నడిచి అరిగోస పడ్డారని ( When the Congress party was in power, women used to walk long distances to fetch drinking water) ఆయన చెప్పారు. అటువంటి దుర్భర పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరధ పథకం తో ఇంటింటికీ మంచి నీరు సరఫరా చేశారన్నారు. అసలు ఇంటింటికి మంచినీరు అందించాలనే ఆలోచనే ఆ పార్టీకీ రాలేదని ఆయన దుయ్యబట్టారు.
విద్యుత్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న ఆలోచనే రాని కాంగ్రెస్ పార్టీకీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటలు చాలు అన్న పిసిసి నేత ప్రకటన ఆ పార్టీ డొల్లతనాన్ని బయట పెట్టేలా ( The PCC leader’s statement that three hours is enough for agriculture is to expose the party’s weakness) చేసిందన్నారు.ఇంత లావు ఇంత పొడుగు ఉన్నా అని డాంబి కాలు పలుకుతున్న కాంగ్రెస్ నేతలు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఎందుకు ఏర్పాటు చెయ్యలేక పోయారని ఆయన ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజల ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను వంచించ చేస్తుందన్నారు.ఈ విషయంలో చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న నల్లగొండ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని (The people of Nalgonda, who have been instilled with consciousness, should be vigilant) ఆయన పిలుపునిచ్చారు. అసలు ఆ ఆరు గ్యారెంటీలలో దాగి ఉన్న మర్మం ప్రజలు తెలుసుకోవాలన్నారు.
అవి ప్రజల కోసం చేసిన గ్యారెంటీలు కావని ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ఆరుగురు నేతల కోసమని ఆయన ఎద్దేవాచేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంత్రి సైదిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, స్థానిక కౌన్సిలర్లు మారగోని నవీన్ గౌడ్, కొమ్ము నాగలక్ష్మి, భక్త ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ నేలపట్ల రమేష్, కొమ్ము శంకర్, మిరియాల స్వామి సిరాజ్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు