Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 8:19 am Posted by : praja deveena

Telanagana IAS TRANSFERS: బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం, భారీగా ఐఏఎస్ అధికారుల రీషఫుల్

 

Telanagana IAS TRANSFERS:  ప్రజా దీవెన, హైదరా బాద్: సాంకేతి క రంగంలో డిజిటల్ తెలంగాణ కొత్త దశలో కి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర పరి పాలనలో అతి పెద్ద మార్పు చోటుచేసుకుంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేం దుకు తెలంగా ణ ప్రభు త్వం (Telangana Govt) ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను రీష ఫుల్ చేస్తూ సంచల న నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయ డానికి కలెక్టర్ల స్థాయి లో విప్లవాత్మక మార్పులు చోటు చేసు కొన్నాయి. జిల్లాల అభివృద్ధి, డిజిట ల్ గవర్నెన్స్, విపత్తు ని ర్వహణ వంటి కీలక రంగాల్లో నూతన దృష్టితో అధికారుల బదిలీలు, నియామకాలు జరిగాయి.

తాజాగా ప్రభుత్వం జరిపిన బదిలీలు, నియామకాల్లో భా గంగా మహబూబాబాద్‌కు స్నేహ శబరీష్, రాజన్న సిరిసి ల్లకు గరిమా అ గర్వాల్, మెదక్‌కు ప్రతిమ సింగ్, భద్రాద్రి కొ త్తగూడెంకు అనికేత్, హనుమకొండకు చాహత్ బజ్పా యి, మహబూబ్‌నగర్‌కు ఖుష్బూ గుప్తా, యాదాద్రికి అనురాగ్ జ యంతి, నారాయణపేట్‌కు ప్రదీప్ జైన్ , జనగాం జిల్లాకు సం దీప్ కుమార్ ఝా నియమితులయ్యారు. ప్రతి నియా మ కంలో యువశక్తి, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజాసేవ పట్ల నిబద్ధ త ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కీలక శాఖల్లో వ్యూహాత్మక మార్పులు… పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కు మార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్ర ట రీ గా దాన కిషోర్,ఇరిగేషన్ శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీగా శ్రీధ ర్, ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్,ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్ర టరీగా రాహుల్ బొజ్జా (బీసీ సంక్షేమ శాఖకు అదనపు బా ధ్యతలు), ఎండోమెంట్స్ కమిషనర్‌గా హనుమంతరావుకు బాధ్యతలు అ ప్పగించడంతో ఆలయ పరిపాలనలో పారద ర్శకతకు నూతన రూపం రానుంది.

విద్యుత్ రంగంలో డిజిటల్ దిశ…రాష్ట్ర విద్యుత్ రంగా నికి సరికొత్త దిశగా TSGPDCLకు ముష్రఫ్ అలీ ఫారూఖీ సీఎండీగా నియమితుల య్యారు. జితేష్ వి. పాటిల్ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్మార్ట్ గ్రిడ్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు వేగం పెరగనందని అభి ప్రాయం వ్యక్తం అవుతోంది.

కీలక బదిలీలు, నూతన బాధ్యతలు.. బదిలీల్లో భాగంగా బి. విజయేంద్ర సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా, అద్వైత్ కుమార్ సిం గ్ ఢిల్లీ తెలంగాణ భవన్ సమన్వ య శాఖకు, సిక్తా పట్నాయక్ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పమేలా స త్పతి లేబర్ కమిషనర్‌గా నియ మితులయ్యారు. ఈ భారీ బదిలీ లు కేవలం పోస్టుల మార్పులు మా త్రమే కావని, ఇవి “విజన్ 2040 తె లంగాణ”కు బలమైన అడుగులు కాబోతు న్నాయని అధికారిక వర్గా లు వెల్లడిస్తున్నాయి.

డిజిటల్ పరిపాలన, పారదర్శక విధానాలు, ప్రజాకేంద్రీకృత పాలన ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త టీమ్‌ తో ముందుకు సాగుతోంది. తెలం గాణ పరిపాలనలో ఈ మార్పులు భవి ష్యత్తులో అభివృద్ధి వేగాన్ని మరింత పెంచనున్నాయని విశ్లే షకులు అభిప్రాయపడుతున్నారు.