Telangana AllTime Record paddy procurement : బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన, రబీకొనుగోళ్లలో దేశంలోనే నంబర్-1గా ‘రేవంత్ సర్కార్’ సరికొత్త రికార్డు సృష్టించింది

Telangana AllTime Record paddy procurement: ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీయాలు కాకరేపవచ్చు.. స వాళ్లు ఎదురుకావచ్చు.. కానీ, మట్టి న మ్ముకున్న రైతు ము ఖంలో నవ్వు చూడటమే పరమావధిగా భావిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో తెలంగాణ ప్రభుత్వం నిరూ పిం చిందని రాష్ట్ర పౌర సరఫరాలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ల క్ష్యాలను కుదించినా, పక్క రాష్ట్రాలు చేతులెత్తేసి నా.. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా యకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగిందన్నారు. ఫలి తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే సరికొ త్త చరిత్ర సృష్టించి నంబర్-1 స్థానంలో నిలిచిందని పే ర్కొ న్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూ రి లక్ష్మణ్ కుమార్, లోక్‌సభ సభ్యులు రఘువీరారెడ్డి, ఎమ్మె ల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ విజయగాథ ను గర్వంగా ప్రకటించారు.
తెలంగాణలో రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల అపార దిగుబడి వ స్తుందని అంచనా వేసి, కొనుగోలు లక్ష్యా లను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను పదేపదే కేంద్ర ఆహార శాఖకు, ఎఫ్‌సీఐ (FCI) కి మొరపెట్టుకున్నా ఫ లితం లేకుండా పోయిందని మంత్రి ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రబీ ఉత్పత్తి 28 శాతం పెరిగితే.. కేంద్రం మాత్రం కొనుగోలు లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుండి ఏకంగా 52 లక్షల టన్నులకు తగ్గిం చి రైతులకు అన్యాయం చేసింద ని, కానీ, కేంద్రం నిర్లక్ష్యానికి మా రై తులు బలికాకూడదని సీఎం రేవం త్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.
అంకెల్లో తెలంగాణ ‘ధాన్యం’ విప్లవం
కేంద్ర ప్రభుత్వం పెట్టిన లక్ష్యం 52 లక్షల మెట్రిక్ టన్నులు కా గా రా ష్ట్రం సేకరించిన ధాన్యం 75 లక్షల మెట్రిక్ టన్నులని, లక్ష్యానికి మించి చరిత్ర సృష్టిస్తూ రైతుల అకౌంట్లలోకి రూ. 17,917 కోట్లమేర నేరుగా కనీస మద్దతు ధర అందిందని చె ప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతు న్న మొత్తం రబీ ధాన్యం కొనుగోళ్ల లో సింహభాగం ఒక్క తెలంగాణదే కావడం విశే షం. జాతీయ స్థాయి లో జరుగుతున్న కొనుగోళ్లలో 61 శా తం వాటాతో తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిందని, పక్కనే ఉ న్న ఆంధ్రప్రదేశ్ 25.03 లక్షల ట న్నులు సేకరిస్తే, తెలంగా ణ అంత కంటే మూడు రెట్లు అధికంగా 75 లక్షల టన్నులు సేకరించి దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రచరిత్రలోనే ఆల్‌టై మ్ రికార్డు
ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి 202 5-26 సంవత్సరంలో తెలం గాణ ప్రభుత్వం ఏకంగా 147 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించిందని, ఇది స్వరాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నే అత్యున్నత రికార్డు అని, మొత్తం 2 95 లక్షల మెట్రిక్ టన్నుల ఉ త్పత్తిలో సగానికి సగం కొనుగో లు చేసి 25.20 లక్షల రైతు లావాదేవీల ద్వారా వారి ఖాతా ల్లోకి రూ.3 5,077 కోట్ల మద్దతు ధరను జమచేసిందని గు ర్తు చేశారు.
రైతు కష్టపడి పండించిన ధాన్యా న్ని అమ్ముకోవడానికి ఇ బ్బంది పడకూడదని రేవంత్ సర్కార్ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసిందని, దేశంలో వైశాల్యపరంగా పెద్దదైన ఉత్తరప్ర దేశ్‌లో కేవలం 4,850 కొనుగోలు కేంద్రాలు ఉంటే తెలంగాణలో రబీ లో 8,575 కేంద్రాలు (యూపీ కంటే 1.7 రెట్లు ఎక్కువ) ఏ ర్పాటు చేశారని వెల్లడించారు. గత రెండే ళ్లలోనే 3,000కు పైగా కొత్త కొను గోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చార ని తెలిపారు. గన్నీ సంచుల కొరత లేకుండా 20.86 కోట్ల సంచులను సిద్ధం చేయగా, ఇంకా 2.11 కోట్ల సంచులునిల్వ ఉన్నాయన్నారు.
అకాల వర్షాలు రైతన్న గుండెల్లో అలజడిరేపిన వేళ ప్రభు త్వం అండగా నిలిచిందని, వర్షానికి తడిసిన 12,557 మెట్రి క్ టన్నుల ధాన్యా న్ని ప్రత్యేక చర్యల ద్వారా బా యి ల్డ్ రైస్ మిల్లులకు తరలించామని , కేవలం 12 గంటల వ్యవధిలోనే రై తులకు మద్దతు ధర చెల్లించి నష్ట పోకుండా కాపాడారని వివరించా రు. మరోవైపు ఈ కొనుగోళ్లలో ఐకేపీ, పీఏసిస్ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కీల క పాత్ర పోషించాయని, వారికి ప్ర భుత్వం తరఫున ఏకంగా రూ.47 0.40 కోట్ల కమిషన్ అందించి మ హిళా సాధికారతకు అద్దం పట్టిం దని చెప్పారు.
రాజకీయ యాత్రలు మానుకోండి..
“ధాన్యం కొనుగోళ్లు ఇంత అద్భుతంగా సాగుతుంటే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాల తో రైతులను గంద రగోళానికి గు రి చేయాలని చూస్తున్నాయని మంత్రి మండి పడ్డారు. కొనుగోలు కేంద్రాల యాత్రల పేరుతో డ్రామాలు ఆ డే బీజేపీ నేతలకు చేతనైతే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రై తులకు న్యాయం జరిగేలా చూడాలని హిత వుపలికారు.రాష్ట్రంలో రైతు పండించిన ప్రతిగింజనూ కొ నేవరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని, రైతాంగా నికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్ను దన్నుగా ఉం టుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం కొను గోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయ ని తెలిపారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ఆరోపణ లు చేయడం మానుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తె లంగాణ రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.రాష్ట్ర రైతుల ప్ర యో జనాలను దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెం చాలని పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టిం చుకోలేదని ఆయన మండిపడ్డారు.




