Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana assembly adjourned తెలంగాణ అసెంబ్లీ వాయిదా

-- సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులు -- మరికాసేపట్లో బీఏసీ సమావేశం

తెలంగాణ అసెంబ్లీ వాయిదా

— సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులు

— మరికాసేపట్లో బీఏసీ సమావేశం

 

ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ తొలుత నివాళులర్పించగా సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సిఎం కేసిఆర్. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా మరికాసేపట్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నేతృత్వంలో బీఏసీ సమావేశం తలపెట్టారు. సమావేశాలు ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయం తీసుకోనున్నారు.

వివాదరహితుడు సాయన్న…దివంగత ఎమ్మెల్యే సాయన్న నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారని, శాసన సభ్యుడిగా ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముందని, ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు.

జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారని, కంటోన్మెంట్‌ ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని చెప్పారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందిందని, ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించారని తెలిపారు.సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.