Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana BRS KCR tensions : గులాబీ దళం లో గుబులు

కొనసాగుతోన్న రాజీనామాల పరంపర పర్వం --వరంగల్‌ ఎంపి స్థానం నుంచి వైదొలిగిన కావ్య కడియం --జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం --బిఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నట్లు స్పష్టం --లిక్కర్‌ స్కాం, ఫోన్‌ ట్యాపింగ్‌ పరిణామాలతో భయం, భయం --బిఆర్ఎస్ ప్రభ తగ్గుతుందని అంతా ఆందోళనమయం --కడియం కావ్య వరంగల్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీచేసే అవకాశం --కడియం శ్రీహరి కూడా కారు దిగనున్నారనేది తేటతెల్లం --ఆయనతో నేరుగా చర్చలు జరుపుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం --మరికొంతమంది ఎమ్మెల్యేల చేరికలు ఉన్నట్లు సమాచారం

గులాబీ దళం లో గుబులు

కొనసాగుతోన్న రాజీనామాల పరంపర పర్వం
–వరంగల్‌ ఎంపి స్థానం నుంచి వైదొలిగిన కావ్య కడియం
–జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం
–బిఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నట్లు స్పష్టం
–లిక్కర్‌ స్కాం, ఫోన్‌ ట్యాపింగ్‌ పరిణామాలతో భయం, భయం
–బిఆర్ఎస్ ప్రభ తగ్గుతుందని అంతా ఆందోళనమయం
–కడియం కావ్య వరంగల్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీచేసే అవకాశం
–కడియం శ్రీహరి కూడా కారు దిగనున్నారనేది తేటతెల్లం
–ఆయనతో నేరుగా చర్చలు జరుపుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం
–మరికొంతమంది ఎమ్మెల్యేల చేరికలు ఉన్నట్లు సమాచారం

ప్రజా దీవెన/ హైదరాబాద్: బిఆర్‌ఎస్‌ నేతలపై భూ కబ్జాల ఆరోపణ లు, లిక్కర్‌ స్కాం, ఫోన్‌ ట్యాంపింగ్‌ లాంటి పరిణామాలు పార్టీ ప్రతిష్ఠ దిగజార్చాయంటున్న అభిప్రాయం సర్వత్రా వ్యక్టం అవుతోంది. దీంతో గులాబీ పార్టీలో గుబులు గుబులు వాతావరణం నెలకొంది. కెసిఆర్ మౌనం, కవిత ( kavitha) అరెస్టు, ఫోన్ టాపింగ్ లు తదితర పరిణామాల నేప థ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

ప్రత్యేకించి పార్ల మెంటు ఎన్నికల క్రమంలో అభ్యర్థుల ఎంపికకు తడ బడిన అధినేత ఆ తర్వాత జరిగే పరిణామాలకు విస్తుబోయే పరిస్థి తి నెలకొంది. కిం దమీదా పడి అభ్యర్థులను ఖరారు చేస్తే ఖరా రైన అభ్యర్థులు సైతం రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ ( congress) వైపు చూడడం బి ఆర్ ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో బిఆర్‌ ఎస్‌కు భారీ షాక్‌ లు తగలబోతున్నాయి.

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటు న్నట్లు, పా ర్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అ ధ్యక్షుడు కేసీఆర్‌కు ఆమె లేఖ రాశారు. గులాబీ పార్టీకి కావ్య రాజీనా మా చేయడంతో సీనియర్‌ నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( kadiyam Srihari) కూడా కారు దిగనున్నారనేది స్పష్ట మైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీ నామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం.

కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఢిల్లీ ( Delhi) అధి ష్ఠానం పెద్దలే ఆయనతో చర్చించి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో భా గంగానే తొలుత కడియం కుమార్తె కావ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చే శారు. కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యతో కలిసి మరికొద్ది గంటల్లో నే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

తాజాగా బీఆర్‌ఎస్‌ తరపున గట్టిగా గళం వినిపించే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరనుండటం ఆ పార్టీకి గట్టి దెబ్బేననే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. వారం క్రితమే కావ్యను వరంగల్‌ స్థానం నుంచి అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. అప్పటి నుంచే ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే బీఆర్‌ఎస్‌లో జరు గుతున్న అంతర్గత వ్యవహారాలు నచ్చకే కడియ శ్రీహరి, కావ్య పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌ నేతలపై భూ కబ్జాల ఆరోపణలు, లిక్కర్‌ స్కాం ( liquor scam) ట్యాంపింగ్‌ లాంటి పరిణామాలు పార్టీ ప్రతిష్ఠ దిగజార్చా యంటూ కేసీ ఆర్‌కు రాసిన లేఖలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నిన్నటి దాకా వరంగల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న కావ్య, అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నేత లతో కడియం శ్రీహరి చేసిన చర్చల్లో భాగంగా ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.

కడియం శ్రీహరితో పాటు పలువురు బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోం ది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ను వీడే ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉం టుందని, పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతుండటం గమనార్హం. రెండు మూడు రోజుల్లోనే పలు వురు ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి.

అప్పుడు రంజిత్‌ రెడ్డి, ఇప్పుడు కావ్య పార్టీ కోరి కోరి టికెట్‌ ఇచ్చిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతుండటం గమనార్హం. చేవెళ్ల స్థానం నుంచి సిటింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికే టికెట్‌ ఇస్తే, ఆయ న కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్ల నుంచే కాంగ్రెస్‌ తరఫున బరి లో నిలిచారు. తాజాగా కావ్య కూడా అదే బాట పట్టడం గులాబీ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ పొందిన అభ్యర్థుల్లో ఇంకొందరు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
మరికొద్ది గంటల్లోనే కాంగ్రెస్ లోకి కేకే… బిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యద ర్శి, ఎంపీ కె.కేశవరావు(కేకే) ఆ పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చారు. కొన్ని రోజు లు గా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే కాంగ్రెస్‌లో చేరుతు న్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ ( ghmc) మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కలిసి హస్తం గూటికి చేరనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శనివారం ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైంది.

ఇదే సమయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డితోపాటు జీహెచ్‌ఎంసీలోని కొందరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, కాంగ్రెస్‌లో చేరిక అంశం పై కేకే ప్రకటనకు ముందు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసు కున్నాయి. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో గురువారం మధ్యాహ్నం కేసీఆర్‌ తో భేటీ అయిన కేకే పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని విస్పష్టంగా చె ప్పినట్లు తెలిసింది.

దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమా చారం.  మీకు, మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా బీఆర్‌ఎస్‌లో జ నరల్‌ సెక్రటరీగా పోస్టిచ్చి నా తర్వాత మీకు అంత్యంత ప్రాధాన్యం కల్పించాను, సీనియర్‌ నాయకుడిగా పార్టీ శ్రేణులు సైతం మిమ్మల్ని గౌరవించాయి. మాతోపాటు పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారతానంటే ఎలా, రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తారు కాంగ్రెస్‌ లో చేరాలన్న మీ నిర్ణయాన్ని మార్చుకోండి.

కొద్ది రోజులుగా పార్టీ పరంగా బయట మీరు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కేకే స్పందిస్తూ తాను పార్టీ మారడం ఖాయమని, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాను కాంగ్రెస్‌లోనే చచ్చిపోతా అని కేకే ఉద్వేగభరిత వ్యా ఖ్య చేశారు. సుదీర్ఘకాలం నేను కాంగ్రెస్‌లోనే పనిచేశాను, 84ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్తున్నా, ఇక కాంగ్రెస్‌లోనే చచ్చి పోతా అని వ్యాఖ్యానించారు.