
Telangana Counterfeit drugs : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణ రా ష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుం ది.ప్రజల ఆరోగ్యా న్ని కాపాడేందుకు నా ణ్యతలేని మందుల విక్రయాన్ని పూర్తిగా అరి కట్టే దిశగా ఒక ఆధునిక డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.రాష్ట్ర డ్రగ్స్ కం ట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక బల్క్ ఎస్ ఎం ఎస్ అలర్ట్ సి స్టమ్ ను వైద్య ఆరో గ్య శాఖ ప్రారంభిం చింది. ఈ స్మార్ట్ వ్య వస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలా ది మెడికల్ షాపు లకు క్ష ణాల్లోనే సమాచారం అందేలా అ న్ని రకాల ఏర్పాట్లు చేస్తూ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా నాణ్య తలేని లేదా అనుమా నా స్పద మందులు గుర్తించిన వెంటనే డీసీఏ అధికారులు అప్ర మత్తమవ్యనున్నారు. కొన్ని సెకన్లలోనే అన్ని ఫార్మసీలకు ఎ స్ఎంఎస్ అలర్ట్ పంపబడు తుంది. ఆ సందేశం అంది న వెంటనే సంబంధిత మందుల విక్రయాన్ని నిలిపివేయా ల ని మెడికల్ షా పులకు స్పష్టమైన సూచనలు చేర బోతున్నా యి. ఈ వ్యవస్థ వల్ల ప్ర మాదకరమైన మందులు ప్రజల చే తుల్లోకి వెళ్లే ముందే అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ము ఖ్యంగా రో గుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూ పే నకిలీ లేదా నాణ్యతలేని మం దుల ప్రమాదాన్ని తగ్గించడం ఈ కార్యక్ర మం ప్రధాన లక్ష్యంగా ప్రభు త్వం చేపట్టింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అ న్ని మెడికల్ షాపులను ఈ డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే పనులు వేగం గా కొనసాగుతున్నాయి. ఒకసారి అలర్ట్ జారీ అయితే ప్రతి ఫార్మసీకి సమాచారం చేరేలా ఆధునిక సాంకేతికతను విని యోగిస్తున్నారు.ఔషధాల నాణ్యతను పర్యవేక్షించడంలో టె క్నాలజీని వినియోగించడం ద్వారా మందుల నియంత్రణ మరింత సమర్థవంతంగా మారనుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధునిక వ్యవస్థలను ప్ర వేశపెట్టి ప్రజల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయాలని డీ సీఏ అధికారు లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
అంతిమంగా ఈ స్మార్ట్ అలర్ట్ వ్య వస్థతో తెలంగాణలో మం దుల మార్కెట్‌పై పర్యవేక్షణ మరింత క ట్టుదిట్టం కావడంతో పాటు ప్రజల కు సురక్షితమైన వైద్య సేవలు అందే దిశగా ఒ క పెద్ద అడుగు పడింద ని చెప్పవచ్చు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో నాణ్యత లేని మందులపై డి జిటల్ ని ఘా పెట్టడం ద్వారా ప్రజలకు ఇకపై నాణ్యమైన మందులు అందేందు కు అవసరమైన చర్యలు తెలంగా ణ ప్రభుత్వం ఎట్టకేలకు ఆధునిక సాంకేతికతతో చర్యలు చేప ట్టింది. దీంతో ప్రభుత్వ చర్యలపై హర్షాతి రేకాలు వ్యక్త మవు తున్నాయి.



