
Telangana Employee Transfer Ban : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మే 1 నుంచి మే 31 వర కు ఇచ్చిన నెల రోజుల ‘బదిలీల పండుగ’ ము గిసింది. జూన్ 1, 2026 నుండి ఉ ద్యోగుల బదిలీలపై ప్రభు త్వం మళ్లీ సం పూర్ణ నిషేధం విధిస్తూ జి.ఓ. ఎం.ఎస్. నెం. 57ను జారీ చేసింది. అంటే ఇకపై సీటు మారాలి అను కునే వారికి ఇప్ప ట్లో ఛాన్స్ లేనట్టే.కానీ, ట్విస్ట్ ఏంటంటే ఈ నిబం ధనల వెను క కొన్ని ‘సీక్రెట్ ఎగ్జిట్ రూట్స్’ (Exception) కూ డా ఉన్నా యి.
జీవో కు సంబంధించిన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. ఈ ‘లాక్’ ఎవ రికి వర్తించదు( Exceptions) కింది సందర్భా ల లో మాత్రం ఇతర ఉద్యోగులను కదపకుండా, ఖాళీ గా ఉన్న సీట్లలో పోస్టింగులు ఇచ్చుకోవచ్చు. దీనికోసం ఫైనాన్స్ డి పార్ట్‌మెంట్ చుట్టూ తిరగాల్సిన అ వసరం కూడా లేదు. ఇది లా ఉంటే ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చిన ప్పుడు ఖాళీ పో స్టులలో భర్తీ చేయ వచ్చు. పోస్టుల రద్దు, రివర్షన్లు, డి ప్యుటే షన్లు (విదేశీ సేవలు మాత్ర మే), మరియు క్రమశిక్షణా చర్య ల వల్ల వచ్చే పోస్టింగులు మాత్రమే.
అదే 6 నెలల కంటే ఎక్కువ కాలం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి వచ్చిన వారికి ఖాళీలలో పోస్టింగ్ ఇవ్వొ చ్చు. 6 నెలల లోపు అర్ధ వార్షిక సె లవుపై వెళ్తే ఆ సీటును వేరే వాళ్ల తో భర్తీ చేయడానికి వీల్లేదు.
రాష్ట్ర ప్రభుత్వం గట్టి వార్నింగ్
జూన్ 1 నుంచి రాబోయే 6 నెలల వరకు ఎలాంటి బదిలీల సడలింపు ప్రతిపాదనలను ఏ శాఖా స్వీక రించడానికి వీల్లే దు. ఆఫీసుల చు ట్టూ రికమండేషన్లతో తిరిగితే కుద రదు. అయినప్పటికీ, పరిపాలనా పరంగా ఏదైనా అత్యవసర ఖాళీని భర్తీ చేయాల్సి వస్తే సదరు ఉద్యోగి తన ప్రస్తుత స్థానంలో కనీసం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసి ఉం డాలి. అంతేకాదు, ఆ ఫైల్ సచివా లయంలోని అడ్మినిస్ట్రేటి వ్ డిపార్ట్ మెంట్, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్ర టరీ, సంబంధిత మంత్రి ఆర్థిక మం త్రి ద్వారా నేరుగా ముఖ్యమంత్రి (CM) టేబుల్ పైకి వెళ్లాలి, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ బదిలీ సా ధ్యమవుతుంది.
పాత రూల్స్ కంటిన్యూ, ఫైనాన్స్ క్లి యరెన్స్ మస్ట్ గతంలో (2008, 2011, 2016, 2025, 2026 లలో) మహిళా, శి శు, దివ్యాంగుల సంక్షేమ మరియు ఇతర శాఖల ద్వారా జారీ అయిన కొన్ని ప్రత్యేక జీవోలు యధాతథంగా కొనసాగుతా యి. అయితే, ఈ జీవోల కింద ఏ చిన్న మార్పుచేయాలన్నా ఆర్థిక శాఖ (Finance Department) అనుమతి తప్పని సరి కానుంది. కాగా ఈ రూల్స్ అ న్నింటికీ మించి ప్రభుత్వం ఒక పెద్ద ‘అస్త్రం’ ప్రయోగించింది. ఒకవేళ ని బంధనలకు విరుద్ధంగా దొడ్డిదారిన ఎవరికైనా బదిలీలు చేస్తే తెలంగా ణ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ (DTA), పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (PAO), డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌం ట్స్ వీరెవ్వరూ సదరు ఉద్యోగుల వేతన బిల్లులను (Salary Bills) ఆమో దించకూడదని ప్రభుత్వం క రాఖండిగా చెప్పేసింది.
అంటే, రూ ల్స్ బ్రేక్ చేసి సీటు మారితే జీతం రాదన్నమాట దీంతో నిజమవు తోంది.మొత్తానికి తెలంగాణ సర్కార్ అ టు ఉద్యోగులకు, ఇటు అధికారు లకు రూల్స్ విషయంలో గట్టి లైన్ గీసిందని చెప్పవచ్చు.నిబంధనలు అతిక్రమిస్తే ‘జీ తాల’కే ఎసరు వ స్తుందని హెచ్చరించడంతో ఇప్పుడు బ ది లీల ఫైళ్లను ముట్టుకోవడా నికి కూడా అధికారులు జంకుతు న్నారని కూడా చెప్పకనే చెప్పవచ్చు.




