Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana forma villeges CM RevanthReddy : తెలంగాణలో మూడు ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ లు

--హైదరాబాదు ను జీవశాస్త్ర రాజధాని గా చేస్తాం --కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది -- బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణలో మూడు ప్రాంతాల్లో
ఫార్మా విలేజ్ లు

–హైదరాబాదు ను జీవశాస్త్ర రాజధాని గా చేస్తాం
–కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది
— బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజ్‌లు ( forma villages) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM RevanthReddy) తెలిపారు. త్వరలో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2ని కూడా ప్రారంభించబోతు న్నామని వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయో ఏషియా సదస్సులో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో హైదరా బాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా చేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా 1/3 వంతు ఫార్మా ఉత్పత్తులను ప్రపంచానికి సరఫరా చేయడం సంతోషదాయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ( software) రంగాల్లో అగ్రగామిగా ఉందని వివరించారు. ఇప్పటికే దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన అంత ర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొని రాష్ట్రా నికి రూ.40 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వా నికే దక్కిందన్నారు.

కొవిడ్‌ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రాజధాని మన నగరం అని అనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ప్రపంచంలో మూడు కొవిడ్‌ ( covide) వాక్సిన్ లు వచ్చా యని, వాటిలో ఒక వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కిందని గుర్తు చేశారు. ఎన్నో పరిశోధనలకు నిలయంగా మన భాగ్యనగరం ఉందని అన్నారు.

జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్‌ కంపెనీలకు ( startup compa nies )  ప్రోత్సాహం అందించ డంతో పాటు ఎంఎస్‌ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించింద ని వెల్లడించారు. ఫార్మా రంగంలో సవాళ్లను తాను అర్థం చేసుకోగల నని అన్నారు. ఇటీవల కొంత మంది ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యాయని, ప్రభుత్వ ప రంగా ఈ రంగానికి బాసటగా నిలుస్తామని అని భరోసా ఇచ్చారు.

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంపై పెట్టుబడి దారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమే ఈ ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు ( Bio Asia Conference)  హైదరా బాద్ వేదిక కావ‌డ‌మేన‌ని అన్నా రు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలం గాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పారిశ్రామికవేతలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబా టులోకి తీసుకొత్సామని తెలిపారు. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుం డా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని నైపుణ్య శిక్ష ణ కేంద్రంగా మార్చెలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేశారని తె లిపారు.

విద్యార్థులకు చదువుతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించే లా తగిన శిక్షణ ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవే త్తలు, ప్రపంచ దేశాల విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.