
Telangana formers commission in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వం రూపొందించిన విధివి ధా నాల ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని రాష్ట్ర వ్యవసా య, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎన్. కోదండరెడ్డి అన్నా రు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని ,ఒకవేళ ఎవరైనా రై తులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బా ధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. శ నివారం రైతు క మిషన్ చైర్మన్ కోదండ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాలబావి,ఎస్ఎల్ బిసీమార్కెట్ యా ర్డ్ లో ఉన్న ధాన్యం కొనుగోలు కేoద్రాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలోని ధాన్యపు రాశులు, తే మ, తాలు,తరుగు తదితర వివరా ల ను తెలుసుకోవడమే కాకుండా ధాన్యాన్ని ప్రత్యక్షంగా పరిశీ లించారు. అనంతరం రెండుచోట్ల రైతు లు, హమాలీలు, ధా న్యం కొనుగో లు కేంద్రాల నిర్వహకులు, అధికారులతో స మావేశాలు నిర్వహించారు.
ధాన్యం సేకరణ పాలసీకి విరుద్ధం గా ఎవరు సేకరణ చేయ కూడదని, ధాన్యం కొనుగోలు విషయంలో రై తులను ఇబ్బం ది పెడితే సహించేది లేదని, ఇందుకు సంబంధిత శాఖల అ ధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించా రు. ధా న్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమే యం ఉండరాదని, కొనుగోలు కేం ద్రంలో రైతు, కొనుగోలు కేంద్రం నిర్వహకు ల కు మాత్రమే సంబంధం ఉంటుందని, ధాన్యం అమ్మిన వెం టనే రైతుకు పక్కా రశీదు ఇవ్వాల ని, అనంతరం రైతు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. కొను గోలు కేంద్రం నుండి మిల్లులకు ధాన్యాన్ని పంపించిన తర్వా త మీల్లులకు వెళ్లాల్సిన బా ధ్యత అధికారులదేనని,ధాన్యం వి షయంలో రైస్ మిల్లర్ల పెత్తనం కుదరదని, గతంలో పద్ధతి చెల్లదని ఆయన స్పష్టం చేశారు. తాలు, త రుగు ,తేమకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రైతులు కొనుగోలు కేంద్రంలోనే పరిష్కారం చేసుకో వాలని, మిల్లర్లకు ఏదైనా స మస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం క్విం టాలకు 45 రూపాయలు మాత్రమే హామాలి చార్జీ తీసుకోవాలని, అంతకుమించి ఎ క్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చ రించారు. ధాన్యం సేకరణలో ప్ర జాప్రతినిధులు, అధికారు లు రైతు లకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తిగా సహకరించాలని ఆ యన కోరారు. ఎ ఫ్సిఐ గైడ్ లైన్స్ ప్రకారం రబీ ధాన్యం కొను గోలు కు సంబంధించి తే మ, తరుగు వంటివి కొనుగోలు కేం ద్రంలొనే ముందే చూసుకోవాలని, రైతుల సొంత ఖర్చులతో కొనుగో లు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువ స్తారని, తాలు, తరుగు పేరుతో వా రిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాద ని, శాస్త్రీయంగా మద్దతు ధర వచ్చే లా చూడాల్సిన అవసరం ఉంద న్నారు.కాంటా వేయకముందు తా లూ, తరుగు, తేమ హమాలీ పే రుతో కొనుగోలు కేంద్రాలలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై ఇలాంటి వన్నీ ఉండడానికి వీలులేదని, ధా న్యం సేకరణ విధానాల ప్రకార మే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
ఎవరైనా తేమ,తరుగు, తాలు పే రుతో రైతులను ఇబ్బం దు లు పెడి తే సహించేది లేదని అన్నారు. ఇకపై ఇలాంటి అన్ని ఆపివేయాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ప క్షపాత ప్రభుత్వం అ ని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రై తు బంధు, రైతు రుణమాఫీ, ప్రభు త్వం ఇవ్వడం జరిగిందని తె లిపారు. కాగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యం కొ నుగోలులో మిల్లర్లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నా రని, తరుగు, తాలు, తూకం పేరిట అనవసరంగా మిల్లుల వ ద్ద లారీలను ఆపుతున్నారని, లారీకి 10 క్వింటాళ్ల చొప్పున తరుగు తీస్తున్నారని, ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిం చాలని కోరారు.

రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న మాట్లాడా రు. రైతు సంక్షేమ కమిషన్ మెంబెర్ సెక్రెటరీ గోపాల్, నల్గొం డ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ ,రెవెన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థా నిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ వై. అశోక్ రెడ్డి,మార్కెటింగ్ ఎ డి ఛాయాదేవి, పౌరస రఫరాల జి ల్లా మేనేజర్ రాంపతి నాయక్, డి ఎస్ఓ, వెంకటే శ్వర్లు, తహసిల్దార్ పరశురాం, మాజీ జెడ్పిటిసి గుమ్మల మో హన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆ ద ర్శ రైతు రామిరెడ్డి తదితరులు ఉన్నారు.




