Telangana Godavari Pushkaralu : కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
--2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆదిపుష్కరాలు --2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్యపుష్కరాలు -‘తెలంగాణ బ్రాండ్’ ప్రతిబింబించేలా ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు --సమన్వయలోపం తలెత్తకుండా స్పెషల్ ఆఫీసర్, శాఖలవారీగా నోడల్ అధికారులు --ఈ నెలఖారుకు డీపీఆర్ పూర్తి, తొలిదశలో ‘టైర్ –1’ ప్రాంతాల్లో పనులు --కేబినేట్ సబ్ కమిటీ తొలిసమావేశంలో మంత్రులు

Telangana Godavari Pushkaralu : ప్రజా దీవెన, హైద రాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతి ష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏ ర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ క్యాబినేట్ సబ్ కమిటీ స్ప ష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగే లా… మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధి కారులను ఆదేశించింది. మంగళవారం డా.బీఆర్ అంబేద్క ర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి సమావేశంలో సభ్యులు కొండా సురేఖ, తుమ్మల నాగే శ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భ విష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశానిర్దే శం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృ త్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పు ష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపే తంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో మరింత రెట్టిం చిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలనూ అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నామన్నారు.
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆదిపుష్కరాలు, 20 28 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వ హించాలని వేదపండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తు లు ఈ పుష్కరాలకు తరలివచ్చే అవకా శముందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జి ల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపి క చేశామ న్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకు ని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగు ణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభి వృ ద్ధికి రాష్ట్ర, జిల్లా ప్ర ణాళికలను ప్రత్యేకంగా రూపొంది స్తు న్నామన్నారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగం గా పనుల్ని ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నా మ న్నారు. ఈ నెల చివరి నాటికి డీపీఆర్ లను పూర్తి చేయా లని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. తొలి దశలో భాగం గా యుద్ధ ప్రాతిపదికన పనులు చే పట్టేందుకు రద్దీ అధికం గా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ – 1’ కింద ఎంపిక చేశా మన్నారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్క రాల నిర్వహణకు ప్ర త్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీ గా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు.
ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమ బ ద్దీ కరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యా ధు నిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశా లపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పుష్కర ఏర్పా ట్లలో రాజీపడే ప్రసక్తే లేదని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నా మన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అ త్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదే శించారు.




