Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 4:43 pm Posted by : praja deveena

Telangana Government Hyderabad Metro Takeover : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ మెట్రో ఇక ప్రభుత్వపరం, ఎల్అండ్ టీ నుం చి భారీడీల్‌తో స్వాధీనానికి రంగం సిద్ధం 

Telangana Government Hyderabad Metro Takeo ver :ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగర రవాణా వ్యవస్థలో సరి కొత్త అధ్యాయం ఆరంభమైంది. భాగ్యనగరం గర్వించే రీతి లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగా ణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ భాగస్వామిగా ఉన్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ చేతిలో ఉన్న వాటాలన్నింటినీ ప్రభుత్వం తన పరిధి లోకి తీసుకురానుంది.

            ఏప్రిల్ 30 డెడ్ లైన్

సుమారు రూ. 15 వేల కోట్ల విలు వైన ఈ భారీ ఒప్పందాన్ని ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పూర్తయితే, హైదరాబాద్ మెట్రో రై లు ప్రాజెక్టుపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు మరియు నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభు త్వం చేతుల్లోకి వెళ్తాయి.

మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీ సుకురావడంతో పాటు, దీనిని మ రింత సమర్థవంతంగా నడిపేందుకు ప్రభుత్వం బో ర్డును ప్రక్షాళన చేస్తూ కీలక నియామకాలు చేపట్టిం ది. బోర్డు చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ (కొనసాగింపు)లతో పాటు బోర్డు డైరె క్టర్లుగా జయేశ్ రంజన్,వికాస్ రాజ్, సుల్తానియా (ఫై నా న్స్ సెక్రటరీ), మరియు డీజీపీ శివధర్ రెడ్డిలు కొనసాగను న్నారు.

     ప్రభుత్వానికి ప్రయోజనం ఇలా

ఈ మార్పుతో మెట్రో రైల్ నిర్వహణ నగరవ్యాప్త విస్తరణ ప నులు, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలలో ప్రభుత్వానికి పూ ర్తి స్వేచ్ఛ లభిస్తుంది. షేర్ అలాట్‌ మెంట్‌ కు కూడా ఇప్పటికే ఆమో దం లభించడంతో హైదరాబాద్ మె ట్రో భవిష్యత్తు ప్రయాణం పూర్తిగా ప్రజా ప్రభుత్వ పాలన లో మరింత వేగంగా సాగనుంది. ఈ కీలక మార్పుల నేప థ్యంలో రాబోయే రోజుల్లో మెట్రో విస్తరణ, ప్రయాణీకుల సౌ కర్యాల విషయంలో ఎటువంటి మెరుగైన నిర్ణయాలు రాబో తున్నాయనేది ఆసక్తికరంగా మారింది.