Telangana Government praja palana pragathi pranalika : సాంకేతిక సేవల డిజి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్య, వేగంకన్నా ప్రాణాలతో గమ్యంచేరడమే ప్రదానం

Telangana Government praja palana pragathi pranalika : ప్రజా దీవెన, చిట్యాల: రోడ్డు ప్రమా దాలు ప్రతి కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని రాష్ట్ర పో లీస్ సాంకేతికత సేవల డిజిపి వి.వి. శ్రీనివాస్ రావు తెలిపా రు. ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ ఆర్థిక ప రిస్థితి, పిల్లల భవిష్యత్తు, కుటుంబ స భ్యుల జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు.
సమయం లేదనే తొందర, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అధిక వేగం, ట్రాఫి క్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వ ల్లే ఎక్కువ ప్ర మాదా లు జరుగుతున్నాయని వివరించారు. ప్రత్యేకంగా యువత లో ఓవర్ కాన్ఫిడెన్స్ డ్రైవింగ్ పెరుగు తోందని, హెల్మెట్ లే కుండా ద్విచక్ర వాహనాలు నడపడం వ ల్ల మరణాల శాతం అధికంగా ఉంటోందని తెలిపారు.
అధిక వేగం, తప్పు దా రిలో వాహనాలు నడపడం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా 90 శాతం ప్ర మాదాల్లో తీవ్ర గాయాలు, మరణాలు సంభవిస్తు న్నాయని పేర్కొన్నారు. బుధవారం చిట్యాల మండలం వెలి మినేడు గ్రామ సభలో నల్గొండ జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పాల్గొని రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు.
ప్రజా పాలనాప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాచరణలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యా ల మండలంలోని వెలి మి నేడు గ్రామంలో గ్రామ సభ సం దర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రో డ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హిం చారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా డిజిపి టెక్ని కల్ సర్వీసెస్ వి.వి. శ్రీనివా స్ రావు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిజిపి వివి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించ కుండా ప్రయాణించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫో న్ ఉపయోగించడం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చ రించారు.“వేగంగా వెళ్లడం ముఖ్యంకాదు ప్రాణాలతో గమ్య స్థానానికి చేరుకోవడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశా రు. ప్రమాదం జరిగి న మొదటి గంటను “గోల్డెన్ అవ ర్”గా పేర్కొంటూ, ఆ సమయంలో బాధితుడిని ఆసుపత్రికి తరలి స్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు చా లా ఎక్కువగా ఉంటా యని తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స నిమి త్తం రూ.1,50,000 వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించే విధా నంపై ప్రభుత్వం చ ర్యలు తీ సుకుంటోందని వెల్లడించారు. రాష్ట్ర డిజిపి ఆ ధ్వ ర్యంలో ట్రాఫిక్ మే నేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ ద్వారా రా ష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రమాదాల నివా రణకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్ల గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టిందన్నారు. వెలిమి నేడు గ్రామ పరిధిలో 2023 సంవ త్సరంలో ప్రమాదాల ద్వారా 16 మం ది మరణించగా, 2024లో 13 మంది, 2025లో 9 మంది, ఈ సంవత్సరం ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే మర ణించారని తెలి పారు.
రోడ్లలోని లోపాలను గుర్తించి సరి చే యడం, ట్రాఫిక్ అవగా హన కార్యక్రమాలు నిర్వహించడం, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఇంజనీరిం గ్ మార్పు లు, రోడ్డు మరమ్మత్తులు, హెచ్చరిక బోర్డులు, బా రికేడ్లు, లైటింగ్ వంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు.
ప్రమాదం ఎప్పుడు, ఎలా జరుగు తుందో ఎవరూ ఊహిం చ లేరు. మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటివా రి నిర్లక్ష్యం ప్రమా దానికి కారణమ వుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి” అని ఎస్పీ సూచించారు. మన తప్పు వల్ల ఇతరులు ఇబ్బంది పడ కూడదనే సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిం చారు.
అనంతరం వెలిమినేడు గ్రామ స ర్పంచ్ చంద్ర రెడ్డి మాట్లా డుతూ గ్రామ ప్రజలంతా రోడ్డు ప్రమాదాల నివారణకు సా మాజిక బాధ్యతగా క. ట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఇక పై గ్రామంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడ ప కూడద ని గ్రామస్థులతో కలిసి తీర్మానం చే శారు. ఈ కా ర్య క్రమం అనంతరం డ్రైవర్ల, గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసి న ఉచిత కంటి పరీక్షా శిబి రాన్ని డిజిపి, ఎస్పీ సందర్శించి ప రీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాలను అందజే శా రు.
ఈ కార్య క్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి, జడ్పీ సీఈ ఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, ఎస్బి సీఐ ఆదిరెడ్డి, నార్కట్ పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రవి కుమార్, విష్ణు, డిటిఆర్బి రిటైర్డ్ సీ ఐ అంజయ్య, ఇతర పోలీస్ అధి కారులు, గ్రామ ప్రజలు, యువత, డ్రైవర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికా రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






