OpinionPoliticsతెలంగాణహైదరాబాద్

Telangana Government series action officers : బిగ్ బ్రేకింగ్, భూబకాసురులపై సర్కార్ ‘ఉక్కుపాదం’, కంచేచేనుమేస్తే ఊరుకోమన్న మంత్రి పొంగులేటి 

--బీఆర్ఎస్ హయాం నాటి భారీ ల్యాండ్ స్కామ్ బట్టబయలు --డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ పై సస్పెన్షన్ చర్యలు --అక్రమ సేల్ డీడ్ల రద్దుకు మంత్రి సంచలన ఆదేశాలు, ఒకరి డిస్మిస్

 

Telangana Government series action officers : ప్ర జా దీవెన, హైదరాబాద్: “ప్రభుత్వ భూములను కాపా డా ల్సిన అ ధి కారులే ‘కంచే చేను మేసినట్లు’ క బ్జాలకు తెగ బడితే ఊరు కునే ప్రసక్తేలేదు. గత బీఆర్ఎస్ పాలనలో కొం దరు అధికా రులు సాగించిన భూదందాలపై సర్కార్ అత్యం త కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభు త్వ భూములపై కన్నేస్తే ఎంతటి వా రినైనా సరే.. చట్టం ముందు నిలబె ట్టి నడిరో డ్డుపైకి లాగు తాం” అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచా ర పౌర సం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా హె చ్చరించారు. పేదల సొంతింటి కల నిజం చేసేం దుకు ప్రతిష్టా త్మ కంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరి శీలన’ కార్య క్రమంలో భా గంగా హైదరాబాద్‌ పరిధిలో సు మారు వందల కోట్ల విలువైన ప్రభు త్వ హౌసింగ్ బోర్డు భూ ముల దందా నూతనంగా వెలుగులోకి వచ్చింది.

తీగ లాగితే కదిలిన డొంక ప్రస్తుతం రెవెన్యూ శాఖలో డిప్యూ టీ కలెక్టర్‌గా ఉన్న రాము నాయక్ , గతంలో (2013-2018) హౌసింగ్ బోర్డులో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీ సర్ (LAO)గా డెప్యుటేషన్‌పై పని చేశారు. ఆ సమయంలో ఆయన అధి కార దుర్వినియోగానికి పాల్పడి అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి నట్లు ప్రాథమిక విచారణలో నిరూ పితం కావడంతో, మంత్రి పొంగు లేటి ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ భూ భాగోతానికి సంబంధించిన గజం రూ. 2 లక్షల భూ మిని భార్య పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించ గా హైకోర్టు 5-6 గేట్ల మధ్య ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డుకు చెం దిన 33.53 చదరపు గజాల అ త్యంత విలువైన స్థలా న్ని (బహి రంగ మార్కెట్లో గజం విలువ రూ. 2 లక్షల పైమా టే) 2018 ఫిబ్రవరి 17న రాము నాయక్ అక్రమంగా రిజిస్ట్రే షన్ చేయించారు.

 

గతంలో బోర్డు నుంచి తొలగించబ డిన వర్క్ ఇన్‌స్పెక్టర్ ఇఫ్తాకర్ అ హ్మద్ భార్య సుబియా సుల్తానా పే రిట ఈ భూమిని రాసిచ్చారు. దీని కి సంబంధించిన ఎలాంటి సొ మ్ము కూడా బోర్డు ఖాతాకు జమకాలే దు. పైగా, సదరు సు బియా సుల్తా నా ఇటీవలే (ఏప్రిల్ 2025లో) ఆ భూమిని మరొకరికి విక్రయించడం గమనార్హం. అయితే విచారణ ము మ్మరం చేయడంతో రాము నాయ క్ 2016 నుండి సాగించి న మరిన్ని భూదందాలు వెలుగుచూశాయి.

వి జయనగర్ కాలనీలో 400 చదర పు గజాలు, తుల్జాగూడ లో 22 చ దరపు గజాలు, లక్ష్మిగూడలో 130 చదరపు గజా లతో పాటు మహ బూబ్ గంజ్ లో 497 చదరపు గజాలు ఇలా ఈ స్థలాలను కూడా రాము నాయక్ పలువురి పేరిట అ క్రమంగా బదిలీ చేసినట్లు తేలింది. బోర్డు అనుమతులను పరిశీలించ కుండా కళ్లు మూసుకుని రిజిస్ట్రేష న్లు చేసిన నా టి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు, మిగతా సబ్ రిజిస్ట్రా ర్ల పాత్రపై లోతైన విచారణ జరపాలని స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీని మంత్రి ఆదేశించారు. అన్ని అక్రమ సేల్ డీడ్‌లను తక్ష ణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు.

సహకరించిన వారికి ‘శాశ్వత ఉద్వాసన

రాము నాయక్ భూదందాలకు వత్తాసు పలికిన కింది స్థాయి సి బ్బందిపై కూడా ప్రభుత్వం చాట్రా తాడేసింది. ఈ క్రమం లో సూ ప రింటెండెంట్ వివేకానంద్ మరో 10 ఏళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఉ ద్యోగం నుండి శాశ్వతంగా తొలగిం పు (Dismissed) గురయ్యారు. మరో సూపరింటెండెంట్ బోనా నా యక్ తక్షణమే సస్పెన్షన్ కాగా రా మునాయక్‌ను కూడా విచారణ పూర్తయిన వెంటనే ఉద్యోగం నుం డి శాశ్వతంగా బర్తరఫ్ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

ఇది లా ఉండగా ఈ విషయంలో రెవె న్యూ, హౌసింగ్ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ “ప్రజా ఆస్తులను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సేవలో కొనసాగే అర్హత లేదు. నకిలీ పత్రాలు సృష్టించినా, భూకబ్జాలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని, ఎం తటి పలుకుబడి ఉన్నా చట్టం ముందు ఎవరూ మి నహా యింపు కాదు. ప్రభుత్వ భూ ముల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కఠిన చర్యలతో మూల్యం చెల్లిం చుకోక తప్పదని హెచ్చరించారు.

Related Articles

Back to top button