OpinionPoliticsజాతీయంతెలంగాణహైదరాబాద్

Telangana Government Sweet news : బిగ్ బ్రేకింగ్, మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, ఉచితంగా ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ

 

Telangana Government Sweet news :   ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రభుత్వం బీసీ మహిళల కోసం కీ లక నిర్ణయo తీసుకుంది. తెలంగాణ బీసీ మహిళల కోసం సరికొత్త శ్రీకారం చుట్టింది. తెలంగాణలో మహిళా సాధికార తకు కొత్త అర్థం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలు స్తోంది. కేవలం సంక్షేమ పథకా లతో సరిపెట్టకుండా, బీసీ మ హిళలను ఆర్థికంగా స్వయంసమృద్ధి వంతులుగా మార్చే ల క్ష్యంతో ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై బీసీ మహిళల చే తుల్లో కేవలం కుట్టుమిషన్లు ఉండవు, వా రి భవిష్యత్తును మార్చే ఆటోమేటిక్ ఉపాధి యంత్రాలు ఉం డబోతున్నాయి.

ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగు తోన్న సమాజంలో సాధారణ కుట్టుమిషన్ల కాలం చెల్లింది. ఇప్పుడు మార్కెట్‌ లో రెడీమేడ్ దుస్తులకు, డిజైనర్ వే ర్‌ కు విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. దీన్ని గు ర్తించిన ప్రభుత్వం, మహిళలకు ఆధుని క ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అం దించనుంది.ఈ ఆటోమేటిక్ మిషన్లతో తక్కు వ సమయంలో ఎక్కు వ పని పూర్తి చేయవచ్చని చెబు తు న్నారు.

నాణ్యమైన ఫినిషింగ్‌తో దుస్తులను కుట్టడం ద్వారా, మహి ళలు తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం ఉందనడంలో అతిశయోక్తి లేదు. దర్జీ వృత్తిని ఒక గౌరవ ప్ర దమైన ఉపాధిగా మార్చు కుంటూ తమ కుటుంబాలను ఆ ర్థికంగా నిలబెట్టుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక కానుందని పరిశీలకులు భావిస్తున్నారు.

   ప్రతి నియోజకవర్గానికో వెయ్యి మిషన్లు

ఈ పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్ర తిష్టాత్మకంగా భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవ ర్గాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా చేప డుతున్నారు. ప్రతి నియోజకవర్గా నికి 1,000 ఆటోమేటిక్ కుట్టుమి షన్లను కేటాయించడం ద్వారా వే లా ది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని లక్ష్యం గా పెట్టుకుంది. ముఖ్యంగా, కుట్టుపనిలో నైపుణ్యం ఉండి సరైన యంత్రాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహి ళలకు ఈ పథకం ఒక వ ప్రసాదం కానుంది.ఇదిలా ఉండగా త్వరలో మార్గద ర్శకాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం క సరత్తు ప్రారంభించింది.

మీ అడుగు మీరే వేయండని, ఈ పథకం ద్వారా లబ్ధి పొం దాలనుకునే ఆసక్తి గల మహిళల కోసం ప్రభుత్వం త్వరలో నే పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. బీ సీ వర్గాలకు చెందిన మ హిళలు, కుట్టుపనిలో ప్రాథమిక నై పుణ్యం ఉన్నవారికి మొదటి ప్రాధా న్యతని వ్వనున్నట్లు అ ధికార వర్గాలు అంచనా చేస్తున్నాయి.

వార్షిక ఆదాయ పరిమితి, వయస్సు వంటి అర్హత నిబంధన లను ప్రభుత్వం త్వ రలో ప్రకటించనుంది.తమ కాళ్లపై తా ము నిలబడి, సమాజంలో ఆర్థిక శక్తిగా ఎదగాలనుకునే తె లంగాణ బీసీ మహి ళలకు ఇది ఒక సువర్ణావకాశంగా భావి స్తున్నారు.మరిన్ని వివరాల కోసం త్వరలోనే వెలువడనున్న అధికారిక ప్రకటనపై దృష్టి సారించాలని ప్రభుత్వం వెల్లడి స్తోంది.

Related Articles

Back to top button