AndhrapradeshOpinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Telangana government Varuna Yagam : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, వర్షాలు విస్తారంగా కుర వాలని 10న వరుణయాగం

Telangana government Varuna Yagam : ప్రజా దీ వె న, హైదరాబాద్: వరాలు కురిపించే వరుణదేవుని అను గ్ర హం కోసం తెలంగా ణ ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుం ది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, పాడిపంట లు సమృద్ధిగా పండాలనే పవిత్ర సంకల్పంతో ఈనెల 10న ‘వరుణ యాగం’ నిర్వహించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండి తులు ఈ యాగ నిర్వహణకు శ్రేష్ఠమైన ముహూర్తాన్ని ఖరారు చేశా రు.

నాగార్జున సాగర్ డ్యామ్ తీరం లో ఉన్న ప్రశాంతమైన విజ య విహార్ ప్రాంగణంలో కృష్ణా, గోదా వరి జీవనదులు జల కళతో పర వళ్లు తొక్కాలని, రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉం డాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష సారథ్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. కాగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ క్రతువులో మహత్తర పూర్ణాహు తి ఘట్టానికి ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి స్వయంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలు నిండాలని కోరుతూ ప్రభుత్వం తలపె ట్టిన ఈ ఆధ్యాత్మిక ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆ సక్తిని రేకెత్తిస్తోంది.

Related Articles

Back to top button