Telangana Government Whips : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగా ణ రాజకీయాల్లో కొత్త దశకు తెరలేపుతూ తె లంగాణ ప్రభుత్వం ఒక వ్యూహాత్మక కీలక నిర్ణయం తీసు కుంది. శాసన ప్రక్రియను మరింత సమర్థవంతంగా నడి పిం చేందుకు, శాసనసభతో పాటు శాసనమండలి మధ్య సమ న్వయాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ విప్‌ల ( whips ) నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు కీలక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామ కృష్ణారావు గురువారం విడుదల చేశారు. దీంతో రా బోయే సమావేశాల్లో ప్రభుత్వ విధానాలను వేగంగా ముం దుకు తీసుకెళ్లే బ్లూప్రింట్ గా అధికార పక్ష నాయకులు భావి స్తున్నారు.అసెంబ్లీలో ప్రభుత్వ గొంతుక మరింత బలంగా వి నిపించేలా, ఎమ్మె ల్యేలను ఒకే దిశలో నడిపించే బా ధ్యత తో ముగ్గురు అనుభవజ్ఞులైన నాయకులను ఎంపిక చేసిం ది రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.
ఈ జాబితాలో వ్యూహాత్మక ఆలోచనలతో గుర్తింపు పొందిన నే త, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసన వ్యవహా రా ల్లో అనుభవం ఉన్న నాయకుడు విజయ రమణారావు ల తో పాటు గట్టి పట్టుదలతో ముందుకు సాగే మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లకు ఈ అవకాశం దక్కింది.
ఈ నియామకాలు కేవలం పరిపాల నాచర్య మాత్రమే కా కుండా రాబోయే రోజుల్లో శాసనసభలో వేగం, క్రమశిక్షణ, రా జకీయ సమన్వయం పెరగబోతుందనే సంకేతం కూడా లేక పోలేదు. మొత్తానికి నల్లగొండ జిల్లాలో మరో కీలక నేత వీరే శంకు ప్రాధాన్యత కలిగిన పదవి లభించడంతో ఆయన అ భిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
శాసనమండలిలో ఇద్దరు.. శాసన మండలిలో అద్దంకి ద యాకర్, బల్మూరీ వెంకట్ లను ప్రభుత్వ విప్ లుగా నియ మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇదిలా ఉం డగా అటు శాసన సభ, ఇటు శాసన మండలి రెండు సభ ల్లోనూ ప్రభుత్వ విప్ ల వ్యవస్థ పూర్తి స్థాయిలో భర్తీ అయి నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.