Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana governor : తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

--ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్రకు --జిష్ణు దేవ్‌ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు --రాజకుటుంబ నేపథ్యం అయోధ్య ఉద్యమంలో పాత్ర --దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

–ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్రకు
–జిష్ణు దేవ్‌ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు
–రాజకుటుంబ నేపథ్యం అయోధ్య ఉద్యమంలో పాత్ర
–దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ( jish nudev varma) నియ మితుల య్యారు. త్రిపుర మాజీ ఉప ము ఖ్యమంత్రి అయిన ఈ యన ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ ( gove rn or ) సీపీ రాధా కృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణు దేవ్‌ 1957 ఆగస్టు 15న జ న్మించారు. ఈయనకు భార్య, ఇద్ద రు కుమారులున్నారు.

1990ల ప్రారంభంలో బీజేపీ ( bjp) లో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018- 23 మధ్య ఉప ముఖ్య మంత్రిగా, త్రిపుర ( tripura ) బ్యాట్మెంటన్ అధ్యక్షుడిగా నూ బాధ్యతలు నిర్వ ర్తించా రు. కాగా, తెలంగాణతో పాటు దే శం లోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవ ర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవ న్‌ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

మరో మూడు రాష్ట్రా ల గవర్నర్ల ను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. హరిబాబు కిషన్‌రా వ్‌ బాగ్డే (రాజస్థాన్‌), ఓం ప్రకాశ్‌ మాథుర్‌ (సి క్కిం), సంతోష్‌ కుమార్‌ గాం గ్వార్‌ (జార్ఖండ్‌), రమెన్‌ దేఖా (ఛత్తీ స్ గఢ్‌), సీహెచ్‌ విజయ శంకర్‌ (మే ఘాలయ)లను గవర్నర్లుగా నియ మించింది. కాగా, ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా తెలంగాణ ( telan gana) అదనపు బాధ్యతలతో ఉ న్న సీపీ రాధా కృష్ణన్‌ ( cp Rad ha Krishnan) ను మహారాష్ట్ర గవ ర్నర్‌గా పంపారు.

అసోం గవ ర్నర్‌ గులాబ్‌ చంద్‌ కఠారియాను పం జాబ్‌ గవ ర్నర్‌గా, కేంద్రపాలిత ప్రాంతం చండీ గఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. సిక్కిం( sikkim) గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అసోం గవ ర్నర్‌గా పంపుతూ మణిపూర్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.

Telangana governor