Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 4:15 pm Posted by : praja deveena

Telangana High Court sensational comments : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, సంపన్ను లకు సంక్షేమ పథకాలెందుకు 

Telangana High Court sensational comments : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో కొనసాగు తున్న సంక్షేమ పథకాలు, ఉచితాల పం పిణీపై తెలంగాణ అత్యు న్నత న్యాయస్థానం అత్యంత కీలకమై న, ఆలోచింప జేసే వ్యాఖ్యలు చే సింది. ఉచిత పథకాల లబ్ధిదారులు ఎవ రు, అసలు సమాజానికి వీటి వల్ల జరుగుతున్న మేలేంటి? అనే అంశాలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కోటీశ్వ రులకూ ఉచితాలా,అర్హతతో సంబంధం లేకుండా ఉచిత ప థకాలను కోటీ శ్వరులు కూడా పొందుతున్నారు. ఉదాహర ణకు ‘రైతు బంధు’ వంటి పథకం ద్వారా ఎంతోమంది సంప న్నులు లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై విప రీతమైన భారంపడుతోందని వ్యాఖ్యానించింది.

   భవిష్యత్ తరాల పరిస్థితేంటి

ప్రభుత్వాలు కేవలం ఉచిత పథ కాలకే పరిమితమైతే వచ్చే భ వి ష్యత్ తరాల కోసం ఏ విధమైన అభివృద్ధి లేదా ప్రణా ళికలు చేయబోతున్నాయని కోర్టు ప్రశ్నిం చింది.ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం? అని పౌరులు ఆలోచిం చేవారు. కాని ఇప్పుడు “ఈ దేశం మనకేమి ఇచ్చింది?” అనే స్వా ర్థపూరిత స్థితికి సమాజం చేరు కుందని ధర్మాసనం వ్యాఖ్యానిం చిం ది.

 హైకోర్టు ఇచ్చిన ప్రధాన సూచన

బాగా చదువుకునే నిరుపేద వి ద్యార్థులకు ఫీజులు చెల్లిం చండి, నిజమైన అర్హులైన పేదలకు మాత్రమే పథకాలు అం దించండి అంటూ హైకోర్టు సూచించింది. ఉచితాలను ప్రతి ఒక్కరికీ పంచడం కాకుండా, కేవలం అర్హత ఉన్నవారికే పరి మితం చేయాలని, చదువుకునే పిల్లల భవిష్యత్తుకు ప్రా ధా న్యత ఇవ్వాలని ప్రభుత్వంపై న్యాయస్థానం స్పష్టమైన అభి ప్రాయాన్ని వ్యక్తం చేసింది.