Telangana Hyderabad rain fall : తెలంగాణలో తెగపడుతోన్న ‘ వర్షం’
--ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుమ్మేస్తోన్న వరుణుడు --కరీంనగర్ లో కుప్పకూలిన రేవం త్ రెడ్డి సభ ఏర్పాటు టెంట్లు
తెలంగాణలో తెగపడుతోన్న ‘ వర్షం’
–ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుమ్మేస్తోన్న వరుణుడు
–కరీంనగర్ లో కుప్పకూలిన రేవం త్ రెడ్డి సభ ఏర్పాటు టెంట్లు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు తెగపడుతున్నా యి. గడిచిన వారం పది రోజులుగా మండుతున్న ఎండలతో అల్లా డిన జనాలకు కాస్తంత ఊరట కలిగిన ప్పటికీ అకాల వర్షాలతో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మె రుపులతో కూడిన వర్షం కురవడం ప్రారంభమైంది.
ఆకాశం పూర్తి గా మేఘావృతం కావడంతో పలు ప్రాంతాల్లో సాయం త్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకు న్నాయి. ప్రధానంగా తెలంగా ణలో ఉమ్మడి కరీంనగర్, కుమురంబీమ్ అసిఫాబాద్, ములుగు, జనగామ, నల్లగొండ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుము లతో కూడిన వర్షం కురిసింది.
ఇక హైదరాబాద్ జంట నగరాల పరిధి లోని పలుచోట్ల ఉరుములు, మెరు పులతో ఒక్కసారిగా వర్షం ప్రారం భమైంది. కూకట్‌పల్లి, నిజాం పేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లి, కొండాపూర్ తో పాటు జూబ్లీహిల్స్, మా దాపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గంలో ఈదు రుగాలులతో కూడిన భారీ వర్షం కుమ్మేస్తొంది.
మియాపూర్‌లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. అదే క్రమంలో సి కింద్రాబాద్, బోయి నపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, మారే డ్‌పల్లి, హబ్సి గూడ, నాచారం, మల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, బహ దూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షా లు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
గాలి దుమారం కు రేవంత్ రెడ్డి ఎగిరిన సభ టెంట్లు…ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ కోసం కరీంన గర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెం ట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదుర య్యాయి.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావ రణం మారిపోయింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ఆఫీస్‌ల నుంచి ఇంటికెళ్లే సమయంలో వర్షం ప్రారంభంకా వడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద వర్షపు నీరు వరదలా పారుతుండడంతో హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అదే విధంగా కూకట్‌పల్లి, కేపీహెచ్‌ఐబీ, మూసా పేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
జూబ్లీహిల్స్, బంజారా హిల్స్‌లో ప్రాంతాల్లో భారీగా ఈదు రుగాలుల తో భారీ వర్షం కురుస్తోం ది. బాలానగర్, ఫతేనగర్, సనత్ నగర్‌లో వర్షం కురుస్తోంది. జీడి మెట్ల, చింతల్, షాపూర్, కుత్బుల్లా పూర్, మి యాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఈదు రుగాల తో కూడిన వర్షం కురుస్తోం ది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చెట్లు, హోర్డింగ్స్ నేలకూలుతున్నాయి.
కోఠి, అబిడ్స్, గోషామహల్, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఈ దురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మొత్తానికి మంగళ వారం సాయంత్రం ఉన్నపలంగా కురిసినటువంటి వర్షానికి హైదరా బాద్ వాసులతో పాటు జిల్లాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.