Praja Deveena
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 4:01 pm Posted by : praja deveena

Telangana IAS Transfers : బిగ్ బ్రేకింగ్, నల్లగొండజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక బదిలీ, ఆమె స్థానంలో బడుగుచంద్రశేఖర్ నియామకం 

 

Telangana IAS Transfers:  ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారు లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాదుకు బదిలీ చేస్తూ ఆమె స్థానంలో సంగారెడ్డి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అదేవిధంగా నీ నిజామాబాద్ కలెక్టర్ గా ఉన్న విన య్ కృష్ణారెడ్డిని జిహెచ్ఎంసి మల్కాజ్గిరి జోన్ అడిషనల్ కమి షనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక మరో ఐఏఎస్ శ్రీజన ను జిహెచ్ఎంసి అడిషన ల్ కమిషనర్ గా, శృతిఓజా ను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గా, శంకర్ ప్రసాదును నారాయణపేట్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.