Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 10:57 am Posted by : praja deveena

Telangana inter exams result : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్ తో ఫలితాల వెల్లడి, బాలికలదే పైచేయి

Telangana inter exams result : ప్రజా దీవెన, హైదరా బాద్: ఏప్రిల్ 12, 2026 ఉదయం 11 గంటలు హైదరాబాద్‌ లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఉద్విగ్న వాతా వరణం. వేలాది మంది విద్యార్థుల కలలు, ఆశలు, ఆందోళ నలు all set to turn into reality. అదే సమయంలో ప్ర భుత్వం తరఫున సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కా ర్యదర్శి యోగితా రాణా బటన్ నొక్కగానే ఇంటర్మీడియట్ ఫలితాలు లైవ్ అంతే…మొబైల్ ఫోన్లు కంపించాయి, వెబ్‌సై ట్లు ట్రాఫిక్‌తో కిక్కిరిశాయి, విద్యార్థుల గుండెల్లో గుబులు ఒ క్కసారిగా ఊపిరి తీసుకుంది.

 ఈసారి ఫలితాల్లో బాలికలదే పై చేయి

ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్ష ఫ లితాల్లో మొత్తం ఉత్తీర్ణ త శాతం 7 5.61 శాతం నమోదు కాగా మొదటి సంవత్స రంలో 66.94 శాతం,ద్వితీయ సంవత్సరంలో 70.52 శాతం నమోదు కాగా ఎప్పటిలాగే అమ్మాయిలే మళ్లీ టాప్ స్టార్ లుగా నిలిచారు. దాదాపు ప్రతి జిల్లాలో అమ్మాయిలు అ బ్బాయిల కంటే ఎ క్కువ మార్కులతో అధిక ఉత్తీర్ణత శాతం తో సత్తా చాటారు.

ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలోనే ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యా ర్థులు హాజరయ్యారు. ఇంటర్ మొ త్తంగా 9,97,075 మంది హాజరు కాగా ఫస్ట్ ఇయర్ లో 4,89,126 మంది, సె కండ్ ఇయర్ లో 5,07,9 49 మంది హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన పరీ క్షలకు సం బంధించి మార్చి 30కల్లా మూ ల్యాంకనం పూర్తి చేయడం అంటే కేవలం కొన్ని వారాల్లోనే ఫలితాలు సిద్ధం చే సింది ఇంటర్మీడియట్ బోర్డు.

అయితే మొదట్లో ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలు ఇ వ్వాలని ప్లాన్ చేసినా బడ్జెట్ సమావేశాల కారణంగా ఆల స్యమైందని అయినప్పటికీ ఇంటర్ బోర్డు మాట నిల బెట్టు కుoదని ఏప్రిల్ రెండో వారం లోనే ఫలితాలు రిలీజ్ చేసింద ని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా ఇక్కడితో కథ ముగి య లేదని పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయినా ఆశలు వద లాల్సిన అవసరం లేదని, మే నెలాఖరులోపు సప్లీమెంటరీ ప రీక్షలు నిర్వహించి మరో అవకాశం ఇవ్వడానికి ఇంటర్మీ డియట్ బోర్డు సిద్ధమవుతోంది.