AndhrapradeshOpinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Telangana journalist forum Allam narayana : స్వరాష్ట్రంలో మీడియా ‘తెలంగా ణీకరణ’ చెందాలి

--ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాలి --తెలంగాణ ప్రజాప్రయోజనాల కోసమే ఇక్కడి మీడియా పనిచే యాలి --ఈ దిశగా ప్రభుత్వమూ ప్రజలు మేధావి వర్గాలు కృషి చేయాలి --టిజెఎఫ్ ఉద్యమ స్పూర్తిని కొనసాగిస్తోంది --- తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) అధ్యక్షుడు అల్లం నారాయణ

 

Telangana journalist forum Allam narayana : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగా ణ అస్తిత్వం మరోమారు ప్ర మాదంలో పడే పరిస్థితులు తలె త్తుతున్న నేపథ్యంలో నాటి ఉద్యమ స్పూర్తితో ప్రతీవొక్క తెలం గాణ జర్నలిస్టు అప్రమ త్తం కావాలని, తెలంగాణ ఉద్యమంలో నిర్వర్తించిన పాత్ర ను కొనసాగించాల్సిన అవసరం ఉందని టిజెఎఫ్ ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు అభిప్రాయ పడ్డారు.తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి 12 ఏళ్లు ముగి సినందున టిజెఎఫ్ తన తట స్థ వైఖరిని విడనాడి ఉద్యమ స్పూర్తితో పనిచేయాలని స మ్మేళనానికి హాజరైన జర్నలిస్ట్ లు అభిప్రాయపడ్డారు. తెలం గాణ ప్రజల కో సం టి జె ఎఫ్ ఎప్పుడూ ప్రశ్నిస్తుందని టిజెఎ ప్ అధ్యక్షుడు అల్లం నారాయణ స్పష్టం చేశారు.నూతన రా ష్ట్రంలోయే పార్టీ ప్రభు త్వం ఏర్పాటైనా స్వయం పాలన ని లదొక్కుకునేదాకా పదేండ్లదాకా మద్దతు ప్రకటించాలని నా డు ఎన్నికలముందే టిజెఎఫ్ చేసుకున్న తీర్మా నాన్ని ఆయ న గుర్తుచేశారు.

తెలంగాణలో ఏర్పాటయ్యే తొట్ట తొలి ప్రభుత్వానికి పదేండ్ల ఉమ్మ డి రాజధాని సమయం గడిచి,బా లారిష్టాలను దాటి, ఆంధ్రా పొత్తు లేని స్వతంత్ర రాజధాని కలిగిన ప్రత్యేక రా ష్ట్రంగా అవతిరించేదాక బేషరతు మద్దతిచ్చి స్వయం పాల నను నిలబెట్టుకోవాలని టి జెఎఫ్ చేసుకున్న నాటి తీర్మానం గడువు ముగిసిందన్నారు.ఇక నుంచి రాబోయే తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వాలను ఏమాత్రం మొ హమాటం లేకుండా ప్ర జాపక్షం వహించి టిజెఎఫ్ ప్రశ్నిస్తుందని పునరుద్ఘాటిం చా రు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా నా టి ఉద్యమ స్పూర్తిని కనబరు స్తూ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలి స్టు గా ముందుకు సాగుతుందని పునరుద్ఠాటించారు.

కాగా నూతనంగా జర్నలిస్టుల వృత్తిలోకి వస్తున్న యువత టిజె ఎఫ్ ను ముందుకు నడిపించాల ని అల్లం నారాయణ ఆహ్వానిం చారు.తెలంగాణ జర్నలిస్టుల ఫో రం (టిజెఎఫ్) 25 యేండ్ల ఆవి ర్భావం సందర్భంగా హైద్రాబాద్ లో ఆత్మీ య కలయిక జరిగింది. నాటి వ్యవస్థాపకులతో సహా, 20 01 నుంచి నేటి వరకు టిజెఎఫ్ వేదికగా పనిచేసిన జ ర్న లిస్టు లందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజర య్యా రు.ఈ సంద ర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, డె స్క్ జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా, పలు మీడియా ఛానల్లు పత్రి కల్లో పనిచేస్తూనే నాటి ఆంధ్రా యాజమాన్యాలకు వ్య తిరేకంగా తెలంగాణ కోసం పనిచేసిన తీరు గురించి, వారి వారి అనుభవాల ను ఈ సందర్భంగా పంచుకున్నారు. తె లంగాణలోని పత్రికల్లో ఛానెల్ లలో తెలంగాణ ఎడిటర్లే ఉం డాలనీ, తెలంగాణ విడిపో యాక కూడా తెలంగాణ జర్నలి స్ట్ లపట్ల వివక్ష కొనసాగుతుందనీ పలువురు జర్నలిస్టులు ఆం దోళన వ్యక్తం చేశారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం, అ స్తిత్వం కోసం, రాష్ట్ర సాధ నకోసం పోరాడుతున్న తెలంగాణ సబ్బం డ వర్గాల, సకల జనుల వార్తల ను ప్రసారం చేయ డానికి వారు పడ్డ బాధల ను, అనుభవించిన వివక్ష గురించి వొక్కొక్కరూ వివ రించా రు. ఈసంద్భంగా అమరులు, జ ర్న లిస్టుల త్యాగాల చరిత్ర ను యాది చేసుకుంటుంటే అక్కడ ఉద్విగ్నవాతావారణం అలుముకున్నది.,

ఈ సందర్భంగా సీనియర్ సంపా దకులు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం అ నేక పో రాటాల దశలను దాటుకుంటూ ప్రయాణం సాగిం చిందని వివరిం చారు. తెలంగాణ ఉద్యమం రా ష్ట్ర సాధన అనంతర పాలనాకా లం అనే ఈ సంధి కాలాన్ని మ రింత అవగాహన చేసుకోవాల్సి వున్నదని, చరిత్రను రికార్డు చే యాల్సిన అవసరమున్నదని, అ ల్లం నారాయణతో పాటు ప్రతీవొ క్క ఉద్యమ జర్నలిస్టు వారి వారి అనుభవాలను గ్రం థస్తం చేయాల్సిన అవసరమున్నదన్నారు. తెలంగాణ జర్న లిస్టులు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులుగా టిజెఎఫ్ పాత్ర గొప్పదన్నారు.తెలంగాణ సమాజం నిత్యం చై తన్యం తో వుంటుందనీ తాను కూడా ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ గా ప నిచేస్తున్నప్పుడు ఉద్యమ కారుల నుంచి వ్యతిరేకతను ఎ దుర్కున్నానని గుర్తు చేసుకు న్నారు.ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా తన అనుభవాలను త్వరలో రి కార్డు చేయనున్నట్టు కె ఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్న లిస్టు అంబేద్కర్ ఓపెన్ యూనిర్శిటీ వీసీ గంటా చక్రపాణి మాట్లా డుతూ తెలంగాణ ఉద్య మంలో అన్ని వర్గాలను కలుపు కుపోతూ ఉద్యమం సల్లపడ్డప్పు డల్లా అన్ని పార్టీలను ఉద్యమ సంస్థలను మే ధావులను సమ న్వయం చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోశించిన ఘనత తెలంగాణ జర్న లి స్టులదని తెలిపారు.నాడు వొక విప్లవకారుడుగా గన్ను పట్టి, అనంతర కాలంలో పెన్నుపట్టి జర్నలిస్టుగా పనిచేస్తూ, తె లంగాణ ఉద్యమంలో టిజెఎఫ్ అధ్యక్షుడుగా తనవంతు పా త్రను పోశించి, రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోశించిన జర్నలి స్టుల నేతగా అల్లం నారాయణ పాత్ర కీలకమని పేర్కొన్నా రు.

ప్రపంచ చరిత్రలో వొక ప్రాంతీయ అస్తిత్వం కోసం జరిగిన పోరాటం లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఘనత వొక్క తెలంగాణ జర్నలిస్టులకే దక్కుతుందని సీనియర్ జర్న లిస్టు రచయిత జూలూరి గౌరీ శంకర్ తెలిపారు.తెలంగాణ సా ధించుకున్న అనంతర కాలంలో ప్రభుత్వాలను ప్రశ్నించడంలో టిజెఎఫ్ కొంత వెనకపడివున్న దని, ఇప్పటికైన మంచిని మంచి అం టూ చెడును చెడుఅంటూ వి మర్శిస్తూ ప్రజాపక్షం వహించా లని నమస్తే తెలంగాణ మాజీ సం పాదకులు కట్టా శేఖర్ రెడ్డి సూచించారు.

‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ రెచ్చిపోతున్నతెలం గాణ వ్యతిరేక శక్తులవల్ల తెలంగాణ అస్తిత్వం మరోమారు ప్రమాదం లో పడిందని, తెలంగాణ ద్రోహు లను తరిమికొట్టే కీలక పాత్రను తెలంగాణ జర్నలిస్టు ఫోరం పో శించాల్సిన సందర్భం వచ్చిందని టీ న్యూస్ సీఈవో శైలేష్ రెడ్డి తెలిపా రు.టిజెఎఫ్ ప్రధాన కార్య దర్శిగా పనిచేసిన వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమన్వ యం తో అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ ఆ త్మీయ సమావేశంలో టి.జె ఎఫ్ వ్యవస్థాపక సభ్యులు, సీని యర్ క్రియశీల సభ్యులు పాల్గొన్నారు,.

వారిలో రమణ కుమార్, పిట్టల శ్రీశైలం,శశికాంత్, కందుకూరి రమేశ్ బాబు తదితరులున్నారు.ఈ సందర్శంగా టిజెఎఫ్ ఉపాధ్యక్షుడు పి వి శ్రీనివాస్, రమేశ్ హజారి, డొంతు రమే ష్, గుంటి పల్లి వెంకట్, టిజెఫ్ కోశాధికారి ఆస్కాని మారుతీ సాగర్, టీ జె ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగానం ద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్, సంపత్, సతీ ష్, నవీన్ యార, కట్టాకవిత, కరుణ, సుమ బాల,కవిత, సరిత, నర్రా విజయ్, సాధిక్, గుప్తా, రమేశ్ వైట్ల, రమా సరస్వతి, య శో ద,సాధిక్, కంబాలపల్లి కృష్ణ, మహేశ్, సూరజ్ భరద్వాజ్, మై క్ టీవీ సతీశ్, చైతన్య, పలు వురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button