Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 12:45 pm Posted by : praja deveena

Telangana Mee Ticket App : తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, రేపటి ప్రయాణం నేటి మీచేతిలో, టికెట్ ఏదైనా ‘యాప్’ ఒక్కటే

Telangana Mee Ticket App : ప్రజా దీవెన, హైదరా బా ద్: ఈ వీ కెండ్ ప్లాన్ రెడీనా ఫ్యామిలీతో ఒక చక్కటి అవు టిoగ్ మెట్రో రైడ్, టెంపుల్ విజిట్, పార్క్‌లో రిలాక్స్, లేక గోల్కొం డ ఫోర్ట్ లేదా మ్యూజియం టూర్ ప్లాన్స్ ఇలా చా లానే ఉం టాయి. కానీ ఒక చిన్న సమస్య టికెట్ క్యూ లైన్లు, వేడి, టై మ్ వృథా అ లాoటి సమస్యలు కూడా ఉంటా యి. ఇక ఆ టెన్షన్‌కు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది. తెలం గాణ ప్రభుత్వం తీపికబురు అందిస్తోంది.

   స్మార్ట్ ఫోన్ ఉంటేచాలు, మీ ట్రిప్ మొత్తంస్మార్ట్‌గా..

ఒక్క క్లిక్‌తో మీ ట్రావెల్ ప్లాన్‌ను సజావుగా మార్చేస్తోంది మీ టికెట్ యాప్ (MEE TICKET APP). ప్లే స్టోర్ నుంచి డౌన్లో డ్ చేసుకుని, మీ ప్రయాణం నుంచి ఎంటర్టైన్‌మెంట్ వరకూ అన్ని టికెట్లు ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. అవి ఇలా ఉ న్నాయి. బస్, మెట్రో టికెట్లు, దేవా లయ దర్శన టికెట్లు, అదే విధంగా పార్కులు, మ్యూజియంల ఎంట్రీ లు, ఫారెస్ట్ సఫారీ బుకింగ్స్, ఈవీ కార్లకు సమీప ఛార్జింగ్ స్టేషన్ల స మాచారం ఇలా ఇండోర్, అవుట్‌ డోర్ యాక్టివిటీస్ అన్నీ ఒకే యాప్‌ లో అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యంగా చెబుతు న్నారు.

   ఇప్పటికే ప్రజల ఆదరణ చూర గొన్న యాప్

తెలంగాణ ప్రభుత్వం రూపొందించి న ఇప్పటికే 2.5 లక్షల డౌన్లోడ్లు కా గా 6 లక్షలకు పైగా బుకింగ్స్, రూ. 4 కోట్లకు పైగా సురక్షిత లావాదేవీ లు, 219 ప్రభుత్వ సేవల లోకేష న్లలో అందుబాటులోకి వచ్చాయం టే అతిశయోక్తి కాదని ప్రభు త్వం అంచనా వేస్తోంది.

ఇదిలా ఉండగా క్యూ పద్ధతుల రో జులు పోయి డిజిటల్ బుకింగ్ వచ్చేసిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మీ సేవ కమిషనర్ టీ.రవి కిరణ్ కూడా ఇదే అభి ప్రాయం వ్యక్తం చేస్తూ ప్రజలు ఇక సులభంగా, వేగంగా సేవ లు పొందగలరని చెప్పారు.