Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana ministers MP elections meeting : ఎంపి ఎన్నికల రణరంగంలో రఘువీర్ గెలుపు నల్లేరుమీదనడకే

--ఈ ఎన్నికలతో బిఆర్ఎస్ కనుమరుగు ఖాయం --కేసీఆర్ కరువు యాత్రల నాటకం హాస్యాస్పదం --ఎంపి ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీలకు ఓట్ల అడిగే అర్హత లేదు --ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయి లో అమలు చేసి తీరుతాం --నాయకులు, కార్యకర్తల కాయకష్టం వల్లే రాష్ట్రంలో అధికారం --మట్టపల్లి ఎంపి ఎన్నికల సన్నహక సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు

ఎంపి ఎన్నికల రణరంగంలో

రఘువీర్ గెలుపు నల్లేరుమీదనడకే

–ఈ ఎన్నికలతో బిఆర్ఎస్ కనుమరుగు ఖాయం
–కేసీఆర్ కరువు యాత్రల నాటకం హాస్యాస్పదం
–ఎంపి ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీలకు ఓట్ల అడిగే అర్హత లేదు
–ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయి లో అమలు చేసి తీరుతాం
–నాయకులు, కార్యకర్తల కాయకష్టం వల్లే రాష్ట్రంలో అధికారం
–మట్టపల్లి ఎంపి ఎన్నికల సన్నహక సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు

ప్రజా దీవెన/నల్లగొండ: దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమే నాయ కులు, కార్యకర్తలు అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా పదేళ్ళ పాటు బిఆర్ఎస్ పార్టీ అరాచకాలను తట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషిచేసిన ప్రతి కా ర్యకర్త పట్టుదలతో కూడిన కాయకష్టం ఎప్పటికీ మర్చిపోలేనిదని కొనియాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన కృషి తరహాలోనే పార్లమెం టు ఎన్నికల్లో కూడా చేసి ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు చరిత్రలో నిలిచిపో యే రీతిలో నిలపాలని పిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ పరిధిలోని మట్టపల్లి పుణ్యక్షే త్రంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల సన్నాక సమావేశంలో ప్రసంగిం చారు. భారత దేశ చరిత్రలో నిలిచిపో యే విధంగా నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరి రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని నా విజయానికి ఏ విధంగా తోడ్ప డ్డారో అదే తరహాలో ఇ ప్పుడు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా అదే స్పూర్తితో కార్యకర్త లు పని చేయాలని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయ కులు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆ పార్టీ లకు డిపాజిట్ గల్లంతై పోటీ చేసే నాయకులకు దిమ్మదిరిగేలా కార్య కర్తలు నడుం బింగిoచాలన్నారు.

గత పార్లమెంటు ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెం డు లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరి ఖా తాలో 10వేల నుంచి 15వేల వరకు నగదు జమ చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని బిజెపి ఈ ఎన్ని కల్లో తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పదే ళ్లు తెలంగా ణాలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాల తో గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎ స్ పార్టీ కూడా ఓట్లు అడిగే అర్హత లేదని ఆయన అన్నారు.

భారతదే శ చరిత్రలోనే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమో దులో అగ్ర గామిగా నిలిచిందన్నారు. దేశప్రజల ను మోడీ ప్రభుత్వం మోసం చేసి రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా రైతుల ఆదా యం సగా నికి పడవేసిందని ఆయన అన్నారు. తెలంగాణలో బిఆ ర్ఎస్ బిజెపి పార్టీలు ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవు అన్నారు. కార్యకర్తల రక్తం త్యాగం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మ నుగడ దక్కిందని వారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటానని ఆయన అన్నారు.

ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగై పోవడం ఖా య మ న్నారు. పదేళ్లు అధికారంలో ఏఎంఆర్ ఎస్ శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి సాగునీరు రాకుండా అడ్డుపడింది ఎవరు తెలంగాణ ప్రజల కు తెలుసున్నారు. నల్లగొండలో కరువు యాత్ర చేపడ తానని మాజీ సీఎం కేసీఆర్ అనడం సిగ్గుచేటు అన్నారు.

సోనియా గాంధీ తెలంగా ణ ఇస్తే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని హామీ ఇచ్చి తెలంగాణ ఇచ్చిన వెంటనే దళితున్ని ముఖ్య మంత్రి చేస్తానని ఆయనే ముఖ్యమంత్రి పదవి పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సార ధ్యంలో మంత్రివర్గం శాసనస భ్యు లు మంచి టీం వర్క్ చేస్తున్నా మని తెలంగాణ ప్రజలు గమనిస్తు న్నారని ఆయన అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీ లను నాలుగు పూర్తి చేశామని మరో రెండు ఎన్నికల కోడ్ ఉన్నందున వాటిని కూడా ఎంపీ ఎన్నికల తర్వాత అమలు చేస్తామన్నారు.

కేటీ ఆర్ హరీష్ రావులకు మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతున్నా రని కోమటి రెడ్డి అన్నారు. మా ఎంపీ అభ్యర్థికి పోటీ ఎవరు లేరని భారీ మెజార్టీ కి నేను ఉత్తమ్ ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా పోటీపడతా మని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 1983 సాగర్ ప్రాజెక్టు విషయంలో సూర్యాపే ట కోదాడ ప్రాంతాల్లో సాగునీటి కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు మాజీ మంత్రి జానారెడ్డి తో 42 సంవత్సరాల పరిచయం ఉందని వారు అప్పటి నుంచి ఎంతో ఓపికతో సూచనలు సలహాలతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాడని కార్యకర్తల బలం వెనక జానారెడ్డి కృషి మరువలేది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వర రావు అన్నారు.

నిబద్ధత నిజా యితీతో పార్టీలో జానారెడ్డి పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చు కున్నారని వాటిని వారి వారసత్వం మరువకుండా కార్యకర్తలను మ రిచిపోకుండా ఏ సమస్య వచ్చినా అండగా ఉండి పనిచేయాలని కో రారు. ఈ జిల్లాలో రెండు పార్ల మెంటు సీట్లను భారీ మెజార్టీతో గెలి పించుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బూతుల వారి గా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఇన్చార్జ్ దీప్ దాస్ మున్సీ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, నేనా వత్ బాలు నాయక్, కుందూరి జై వీరారెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, శంకర్ నాయక్,హుడా చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.