Telangana movement: ఉద్యమమే ఊపిరిగా యాదిలో ‘ తెలంగాణ’
ఎన్నో పోరాటాలు, మరెన్నో ఆత్మ బలిదానాలు, ఇంకెన్నో ఉద్యమా లు, విద్యార్థుల నిరసనలు, నిరు ద్యోగుల ఆర్తనాదాలు ఇలా ఎన్నో అజరామర దృశ్యాలు. మా నిధు లు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే కావాలoటూ ఎందరో ఉద్య మకారులు తమ జీవితాలను త్యా గ ఫలితమే ప్రత్యేక రాష్ట్రo. తొలి, మలి దశల ఘట్టాలు, ఉద్య మమే ఊపిరిగా తెలంగాణ ఆవిర్భావమే శ్వాసగా అలుపెరుగని పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భానికి దశాబ్ద కాలం చేరువైంది.
జూన్ 2తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ళు
కళ్ళ ముందే ముందు కదలాడు తోన్న తొలి, మలి దశల ఘట్టాలు
ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగాఎందరో ఉద్యమకారుల జీవితాల త్యాగం
రాష్ట్ర సాధనే శ్వాసగాఆంధ్రులతో
వీరోచిత పోరాటం, బలిదానాలు
తెలంగాణ చరిత్రలో మరుపు రాని ఘట్టాలు చిరస్మరణీయం
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా అమర వీరులకు ‘ దీవెన’ ప్రత్యేక నివాళు లు
ప్రజాదీవెన, తెలంగాణ బ్యూరో: ఎన్నో పోరాటాలు(Telangana movement), మరెన్నో ఆత్మ బలిదానాలు(Soul sacrifices), ఇంకెన్నో ఉద్యమా లు, విద్యార్థుల నిరసనలు, నిరు ద్యోగుల ఆర్తనాదాలు ఇలా ఎన్నో అజరామర దృశ్యాలు. మా నిధు లు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే కావాలoటూ ఎందరో ఉద్య మకారులు తమ జీవితాలను త్యా గ ఫలితమే ప్రత్యేక రాష్ట్రo. తొలి, మలి దశల ఘట్టాలు, ఉద్య మమే ఊపిరిగా తెలంగాణ ఆవిర్భావమే(Telangana formation day) శ్వాసగా అలుపెరుగని పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భానికి దశాబ్ద కాలం చేరువైంది. తెలంగా ణ ఏర్పాటులో ప్రతీ ఉద్యమం ఓ కీలక ఘట్టమే. తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో ఎన్నో ఘట్టాలు ఇప్ప టికీ కొన్నిసార్లు కళ్లముందు కదలా డుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాధ న వెనుక ఉన్న అజరామర సదరు పోరాట ఘట్టాలను ప్రజా ‘ దీవెన ‘ తో మననం చేసుకుందాం.
ఓ ఒప్పందం.. ఓ ఉద్యమం
పెద్ద మనుషుల ఒప్పందం.. తెలుగు రాష్ట్రాలు కలవడానికి, విడిపోవడానికి కారణ భూత మైంది.1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పటు తర్వాత ఆఘమేఘాల మీద అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని తరలించింది. ఆంధ్ర రాష్ట్రం ఎగువ భాగంలో ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉండడం, హైదరాబాద్ ద్వారా ప్రవహించే కృష్ణా(Krishna river), గోదావరి(Godavari river) నదీ జలాల అందుబాటు వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పా టును ప్రేరేపించాయి. దీన్ని చాలా మంది తెలంగాణ ప్రాంత నాయ కులు వ్యతిరేకించారు. కాగా వారి భయాలు తొలగించే ప్రయత్నం లో తెలంగాణ ప్రాంతానికి అనేక హామీలతో ఓ తీర్మానం పెద్ద మనుషుల ఒప్పందానికి అవకాశం లభించింది. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956 మార్చి 5న నిజామాబాద్లో జరి గిన భారత్ సేవక్ సమాజ్ సమావే శంలో విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పా టును ప్రకటించారు.
పెద్ద మనుషుల ఒప్పందంలో పలు ఉల్లంఘనలు.. జై తెలంగా ణ ఉద్యమం(Jai Telangana Movement) అయితే, పెద్ద మను షుల ఒప్పందంలోని పలు రక్షణల ఉల్లంఘనలు, ప్రాంతీయ వివక్షల తో 1969లో ‘జై తెలంగాణ’ ఉద్య మం పురుడు పోసుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచలో థర్మల్ విద్యు చ్చక్తి కేంద్రం (కేటీపీఎస్)లో తెలం గాణ ప్రజా పోరాటానికి బీజం పడింది. ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు పాల్వంచ థర్మల్ విద్యుత్ కేంద్రంలో(thermal power station) అన్యా యాలను వెలుగులోకి తెచ్చి ఉద్య మాన్ని ఆరంభించాడు. తదనం తరం తెలంగాణ జిల్లాల్లో పర్యటిం చి ఉద్యోగులు, యువకులకు అవగాహన కల్పించారు. అప్పటి నిరసనల్లో ఎందరో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పోలీసు కాల్పుల్లో ఎందరో ప్రాణా లు కోల్పోయారు కూడా. రోడ్లపైకి వచ్చిన విద్యార్థులను నిలువ రించడం ఎవరి వల్ల కాక అప్పటి ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సిద్దించకపోయినా సమాజాన్ని మాత్రం ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.
ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకoతో… తెలంగాణ వారిని సంతృప్తి పరచడం కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ముందరేశారు. అటు, తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పం దనగా 1972లో ‘జై ఆంధ్ర ఉద్య మం’ ప్రారంభమైంది. ఈ క్రమంలో 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రా ల పథకం రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి ఏపీలోని అన్యా యానికి గురవుతున్నామనే అసం తృప్తి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ క్రమంలో 1990లో వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం(Telangana separate state movement) మళ్లీ ప్రారంభమైంది. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యే క తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పా టైంది. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే గొంగళి పురు గును కూడా ముద్దాడుతాం’ ఇది కేసీఆర్ అప్పటి విస్తృత ప్రాచుర్యం పొందిన నినాదం. మలి దశ ఉద్య మాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర సాధనం కోసం అలుపెరుగని పోరాటం చేశారు కేసిఆర్. ఈ ఉద్య మంలో తెలంగాణ సకలజనులతో పాటు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎందరో ఉద్యమకారులు పోరాట ప్రతిఫలం ప్రత్యేక తెలంగాణ కళ సాకారమైంది.
తన పదవులకు రాజీనామా చేసి 2001 సెప్టెంబర్ లో జరిగిన ఉప ఎన్నికలో సిద్ధిపేట నుంచి కేసీఆర్ గెలుపుతో ప్రత్యేక రాష్ట్రం సాధన పోరాటానికి పునాది పడింది.2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుతో వెళ్లి 26 మంది ఎమ్మెల్యే లు గెలుచుకున్నారు. అప్పటి కాంగ్రె స్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగం, యూపీఏ కామన్ మిని మమ్ ప్రోగ్రాంలో ఈ అంశాన్ని చేర్చారు. తెలంగాణకు అనుకూలం గా 36 పార్టీలు లేఖలు ఇచ్చాయి.
అనంతరం కాంగ్రెస్ తనను మోసం చేసిందని 2009 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలో మహా కూటమితో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కేవలం 10 చోట్లే గెలిచారు. 2009 సెప్టెంబర్లో అప్పటి సీఎం వైఎస్ మరణం తర్వాత అదే ఏడాది అక్టో బర్ 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.
నిరాహార దీక్ష ఉద్యమంలో కీలక మలుపు …తెలంగాణ మలి దశ(Telangana separate state movement) ఉద్యమానికి కీలక మలుపు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తో బలంగా తయారైంది. 2009 నవం బర్ 29న సిద్దిపేట కేంద్రంగా ఆమ రణ నిరాహార దీక్ష చేస్తానన్న కేసీ ఆర్ ప్రకటనతో తెలంగాణలో మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిం ది. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. కేసీఆర్ను అరెస్ట్ చేసి నిమ్స్ తరలించినా అక్కడా దీక్ష కొనసాగించారు. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఆందోళ నలు, నిరసనలతో నిప్పులకొ లిమిలా మారడoతో కేంద్రo లోని యూపీఏ ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అను కూలంగా ప్రకటన చేసింది. కేంద్ర ప్రకటనతో తెలంగాణలో సంబురా లు మొదలుకాగా, ఆంధ్ర ప్రాంతం లో జై సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారం భమైంది.
రాజీనామాలు, నిరసనల తో హోరెత్తడంతో డిసెంబర్ 23న ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను కేంద్రం పక్కన పెట్టింది. ఉమ్మడి ఏపీ పరిణామాలపై అధ్యయానానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అన్ని రాజ కీయ పక్షాలు, సంస్థలు ఏకమై ‘తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ’గా ఏర్పాడి ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రం చేశాయి. నిరుద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, సాగర హారం, సమరదీక్ష, ఛలో అసెంబ్లీ వంటి నిరసనలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక ఘట్టాలు.
తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యో గులు, ఉద్యమకారులు(Telangana industrialists and activists) 2011 ఫిబ్రవరి 17న ప్రారంభించి మార్చి 4 వరకూ 16 రోజుల పాటు సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. తెలం గాణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యక లాపాలన్నింటినీ స్తంభింపచేశారు. ఉద్యోగుల పెన్ డౌన్, కార్మికుల టూల్ డౌన్, ఉపాధ్యాయుల చాక్ డౌన్ వాటితో పూర్తిగా స్తంభించి పోయింది.2011 మార్చి 10న కేసీఆర్ ‘మిలియన్ మార్చ్’కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ దిగ్భందనానికి పిలుపునివ్వగా ఉద్యమం రాజకీయ నేతల చేతుల్లోనుంచి ప్రజల చేతుల్లోకి వెళ్లినట్లయింది. సకల జనుల సమ్మె – 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకూ 42 రోజులు నిర్వహించిన సమ్మెతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ అటెండర్ల దగ్గర నుంచి అధికారుల వరకూ అందరు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
నెక్లెస్ రోడ్లో తెలంగాణ మార్చ్
2012 సెప్టెంబర్ 30న హుస్సేన్ సాగర్ – నెక్లెస్ రోడ్లో తెలంగాణ మార్చ్(Telangana March) నిర్వహించారు. ఆ తర్వాత సమరదీక్షతో ఉద్యమం మరో స్థాయికి వెళ్లింది. 2013, జూన్ 13న ‘ఛలో అసెంబ్లీ’ పిలుపుతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ముందడుగు పడింది. ఉద్యమాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తానికి కల సాకారమైన వేళ పార్లమెంటులో 2014, ఫిబ్రవరిలో ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం(Andhra Pradesh Reorganization Act) ఆమోదం పొందింది. ‘ద బిల్ ఈజ్ పాస్డ్’ అంటూ పార్లమెంటులో ప్రకటన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి కల, ఆకాంక్ష కళ్ల ముందు కదలాడాయనే చెప్పాలి. అనంతరం జూన్ 2, 2014న హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ అధికారికంగా ఏర్పా టైంది. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సహా పదేళ్లు ఉమ్మ డి రాజధానిగా కేంద్రం నిర్ణయించింది.
Telangana movement memories