Telangana Sadhana with Gandhi’s theories: గాంధీ సిద్ధాంతాలతోనే తెలంగాణ సాధన
-- నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
గాంధీ సిద్ధాంతాలతోనే తెలంగాణ సాధన
— నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: గాంధీ సిద్దాంతాలు ఆదర్శంగా తీసుకొనే రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు నాటి ఉద్యమ నాయకుడు అహింసా మార్గం లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధించడం జరిగిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గాంధీ స్వరాజ్య సిద్దాంతంతోనే పల్లె లు పట్టణాలు గా,పట్టణాలు నగరాలు అభివృద్ది చెందుతున్నాయని గుర్తు చేశారు.
సోమవారం 154 వ గాంధీ జయంతి సందర్భంగా రామ గిరి గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ తెల్ల దొరల పాలన నుండి అహింసా యుత పద్దతి లో దేశం కు స్వాతంత్ర్యం తీసుకు వచ్చారని అన్నారు.
ప్రతి పౌరుడు గాంధీ ఆశయాలను స్ఫూర్తి గా తీసుకొని ఆయన చూపిన మార్గం లో నడవాలని సూచించారు. భూమి ఉన్నంత ప్రజల మనస్సు లో మహాత్మా గాంధీ చిరస్థాయిగా గుర్తుండి పోతారని అన్నారు. జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం దేశ స్వరాజ్య మని బావించి గ్రామాలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుందని గాంధీ చెప్పారని అన్నారు.
జిల్లాలో రాష్ట్రం లోనే అత్యధిక 844 గ్రామాలు, 8 పట్టణాలు జిల్లాలో ఉన్నాయని, స్థానిక సంస్థలు ప్రజా ప్రతినిధులు గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా పట్టణం లో రాష్ట్ర పురపాలక , పట్టణ అభివృద్ది శాఖ, ఐ .టి.శాఖ మంత్రి కె.టి.రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ల చేతుల మీదుగా సుమారు వెయ్యి కోట్ల రూ.ల అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు.
ఈ సమావేశం లో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, యమా కవిత, మాలే శరణ్య రెడ్డి, బషీర్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తదితరులు పాల్గొన్నారు.