Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 2:10 pm Posted by : praja deveena

Telangana temperatures combined : తెలంగాణలో వాతావరణయుద్ధం, ఓవైపు భానుడు భగభగమంటుం టే మరోవైపు వరుణడు సన్నద్ధం 

Telangana temperatures combined : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు, వానల మ ధ్య ఒక ఆసక్తికరమైన డ్రా మా నడ వబోతోంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చి న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా టర్న్ తీసుకోనుం దని సమాచారం అందుతోం ది. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళా ఖాతాన్ని దా టు కుంటూ చకచకా ముందుకు కదులుతు న్నాయి. దీనికి తోడు దక్షిణ బీహార్ నుంచి ఉత్తర కోస్తా ఆం ధ్ర వరకు సము ద్ర మట్టానికి 1.5 కి లోమీటర్ల ఎత్తులో ఒక ఉత్తర- దక్షిణ ద్రో ణి’ యాక్టివ్‌గా ఉంది. ఈ రెండు సిస్టమ్స్ కలిపి తెలంగాణ వైపు మేఘాలను లాగుతున్నాయి.

 

అయితే వచ్చే మూడు రోజుల్లో పగలoతా ఎండ దంచికొట్టి నా, సాయంత్రం లేదా రాత్రి అయ్యేసరికి సీన్ రివర్స్ అవు తుంది. ఉరుము లు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షా లు పడే ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వే గంతో ఈదురుగాలులు వీస్తాయి. రోడ్డుపై వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్త బాస్ అంటూ వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తోంది. వర్షాలు పడినా కూ డా పగటి పూట వేడి పెద్దగా తగ్గదు. ఉ క్కపోత, ఎండలు ఇంచు మించు ఇలాగే ఉంటాయి. ఈ క్లై మేట్ చేంజ్‌లో ట్విస్ట్ ఏంటంటే ఒక వై పు వర్షాల అలర్ట్ ఉ న్నప్పటికీ, రా ష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో మాత్రం మ ధ్యాహ్నం పూట వడ గాల్పులు (Heat Waves) వీచే ప్రమా దం ఉంది.

నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలోకి విస్తరిస్తే, రాబో యే రో జుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగి ఎండల నుంచి శాశ్వత ఉపశమ నం లభిస్తుందని వాతావరణ నిపు ణులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పు డు పొరపాటున కూడా చెట్ల కింద నిల బడకండని సూచి స్తున్నారు. గాలు లు బలంగా వీస్తున్నప్పుడు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు.మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కు వ గా ఉంటుంది కాబట్టి, బాడీ డీహై డ్రేట్ అవ్వకుండా తగినం త నీరు లేదా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండని చెబుతు న్నారు.