Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Welfare Manifesto: తెలంగాణ సంక్షేమ మేనిఫెస్టో

తెలంగాణ సంక్షేమ మేనిఫెస్టో

— అదిరిపోయే మేనిఫెస్టోను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
— ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న పథకాలతో బేరీజు
— తెల్లకార్డు ప్రజలందరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా
— అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు
— మహిళలకు సౌభాగ్య లక్ష్మి

ప్రజా దీవెన/ హైదరాబాద్ :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదిరిపోయే మేనిఫెస్టోను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ హోరాహోరీ ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్న సమయంలో కేసీఆర్ మరోసారి సంక్షేమ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు.

ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టి కేసీఆర్ హ్యాట్రిక్ లక్ష్యంగా సంక్షేమ మేనిఫెస్టును రూపొందించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పథకాలను బేరీజు వేసుకుని అమలు సాధ్యమయ్యే పథకాలను తీసుకొచ్చారు.  కేసీఆర్ తన మార్క్ మేనిఫెస్టోను విడుదల చేశారు.

మొదటి సారి పూర్తిగా సంక్షేమ అజెండా తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో అధికారం చేపట్టిన కేసీఆర్, రెండోసారి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రకటించి ఇప్పుడు మూడోసారి అదే పంథాను అనురిస్తున్నారు. రెండు దపాలుగా చెెప్పిన దాని కంటే ఎక్కువగా అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో చెప్పనవి కూడా చేశామన్నారు.

కళ్యాణి లక్ష్మి, విదేశీ విద్య ఎక్కడా ప్రకటించకపోయినా అమలు చేశామన్నారు. దాదాపు 99.9 శాతం ఎన్నికల ప్రణాళికలను అమలు చేశాం. రాష్ట్రంలో దళితులకు దళిత బంధు ప్రకటించాం. ఇప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చే ఆరునెలల్లో అమలు చేస్తామన్నారు కేసీఆర్.

*ప్రజలందరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా:* ఒక కోటీ పది లక్షల్లో 93 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా పేరుతో వచ్చే బడ్జెట్లో పెట్టనున్నాం అన్నారు. ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా ఇవ్వబోతున్నాం. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం అందబోతోంది.

దీనికి ఒక్కో కుటుంబంపై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. ఇది రైతు బీమా తరహాలోనే ఉంటుంది. కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే పది రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరనుంది. అన్ని కుటుంబాలకు రక్షణగా ఉంటుంది.

*రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం:* అన్నపూర్ణలా తయారైన రాష్ట్రం ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నాం. అందుకే ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తాం.

*నెల పింఛన్లు ఐదు వేలకు పెంపు:* ఆసరా పథకం తెలంగాణ భవనం నుంచి పుట్టింది. విధి వంచితుల కోసం రూపొందించిన పథకం ఇది. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత కాబట్టి వారికి మొదట వెయ్యి రూపాయలు ఇచ్చాం. తర్వాత దాన్ని 2016 రూపాయలు చేశామన్నారు.

ఇప్పుడు దాన్ని 5వేలు చేయబోతున్నాం.ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది అంటే మార్చి తర్వాత మూడు వేలు చేస్తాం. ఇలా ఏడాదికి పెంచుకూ వెళ్లి ఆఖరి సంవత్సరం వచ్చే సరికి ఐదు వేలు చేయబోతున్నాం. ఏపీ ప్రభుత్వంలో దీన్ని విజయవంతంగా అమలు చేసి దాన్ని మూడు వేలుకు పెంచారు.

ఇక్కడ కూడా అదే మాదిరిగా ఇక్కడ పెంచుకుంటూ వెళ్తాం. వికలాంగుల పింఛన్ను 6 వేలకు పెంచుకుంటూ వెళ్తాం. మార్చి తర్వాత ఐదు వేలు చేస్తాం. అక్కడి నుంచి ఏటా మూడు వందలు పెంచబోతున్నాం.

*రైతు బంధు సాయం పెంపు* :రైతు బంధు పథకం కూడా ఇప్పుడున్న పదివేలను పదహారు వేలకు పెంచుకుంటూ పోతాం. 12 వేల నుంచి మొదలు పెట్టి 16 వేలకు తీసుకెళ్తాం.

*మహిళలకు సౌభాగ్య లక్ష్మి* :అర్హులైన మహిళలకు నెలకు మూడు వేలభృతి ఇవ్వాలని నిర్ణయం. దీనికి సౌభాగ్య లక్ష్మి పేరుతో దీన్ని అమలు చేయబోతున్నాం.

*గ్యాస్ సిలిండర్ పై రాయితీ* :అర్హులైన ప్రజలకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందించాలని నిర్ణయం.

*ఆరోగ్య శ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు* :సాధారణ ప్రజలతోపాటు జర్నలిస్టులకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు. కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో అమలు

*ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు* :ఇంటి జాగ లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న హౌసింగ్ పాలసీని కొనసాగిస్తాం.

*హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు* :అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు రెసిడెన్స్ స్కూల్ విధానం కొనసాగించాలని నిర్ణయం. రెసిడెన్స్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు.

*డ్వాక్రా సంఘాలకు సొంత భవననాలు* :రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలకు (డ్వాక్రా సంఘాలకు) సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీఅసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత
అసైన్డ్ భూముల విషయంలో వెసులుబాటు. కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్నా ఆ భూములకు కోట్ల రూపాయల డిమాండ్ ఉంది. అలాంటి భూములు అమ్ముకుని మరోచోట పదెకరాల వరకు కొంటున్నారు. కానీ తమకు అలాంటి సదుపాయం లేదని, దాన్ని రిలీవ్ చేయాలని దళిత సోదరులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి దళితులకు హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తాం. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పిస్తాం.

*ప్రభుత్వ ఉద్యోగుల సీ.పీ.ఎస్.పై అధ్యయనం..* :
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్కు మార్చే విషయంలో స్టడీ చేయాలని నిర్ణయం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనున్నాం. నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం.