Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Telugustates Fierce temperatures : అంతటా హీట్ వేవ్ అలర్ట్, నిప్పుల కుంపటిగా మారిన తెలుగు రాష్ట్రాలు

 

Telugustates Fierce temperatures :  ప్రజా దీవెన, హై దరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని ప రాకాష్టకు తీసుకెళ్తున్నాడు. సాధారణ ఎండలు కావివి అక్ష రాలా నిప్పుల కొలిమిని తలపిస్తు న్నాయని ఆనోటా ఈ నో టా కాకుండా సర్వత్రా ఒకటే మాటగా వినపడుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తె లంగాణ రా ష్ట్రాలు రెండూ ప్రస్తుతం రికార్డు స్థా యి ఉష్ణోగ్రతల తో ఉడికిపోతున్నాయoటే అతి శయోక్తి కా నేకాదు. వాతావరణ శాఖ అందించిన తాజా ‘హాట్’ అ ప్‌డే ట్స్ ప్రకారం పరిస్థితి ఇలా ఉంది.

     తెలంగాణలో అదే ‘మంట’

తెలంగాణ రాష్ట్రంలో ఏపీకి ఏ మాత్రం తీసిపోకుండా ఇ క్క డి జిల్లల్లోనూ భానుడు భగభగలాడుతున్నాడు. పెద్ద పల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో అత్య ధి కంగా 46.5 డిగ్రీల ఉష్ణో గ్ర త నమోదైంది. తెలంగాణ టాప్ హాట్ స్పాట్స్ గా భద్రాద్రి కొత్తగూ డెం (చుంచుపల్లి) 46 .4° C, మహ బూబాబాద్ (కురవి) 46.3°C, ఆదిలాబాద్ (జై న థ్) 46.2°C, సిద్ది పేట (అక్కన్నపేట్) 46.0°C చొప్పున ఉ ష్ణోగ్రతలు నమోదు కాగా తెలంగాణలోని దాదాపు 20 జి ల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటి దూసుకు పో తున్నాయి.

అయితే ఈ భీకరమైన ఎండల తీవ్రత సోమవారం వరకు ఇ లాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధి కా రులు హెచ్చరిస్తు న్నారు. మధ్యాహ్నం పూట అత్య వ సర మైతే తప్ప బయటకు రాక పోవడం, శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ప్రస్తుతానికి అత్యంత కీలకం కా నుంది.

    ఆంధ్రప్రదేశ్ లో ఎండలు రికార్డులు

ఆంధ్రప్ర దేశ్‌లో ‘పిడుగు’లాంటి ఎం డలతో ఎండల తీవ్రత అన్ని రికా ర్డులను బద్దలు కొడుతోంది. పిడు గురాళ్ల పేరుకు తగ్గట్టే అక్కడ ఏకం గా 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత న మోదై నిప్పుల గుండంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇ తర ప్రాంతాల హీట్ రేటింగ్స్ ఇలా ఉ న్నాయి. బాపట్ల (వే టపాలెం), కృ ష్ణా (నందివాడ) 47.6°C,ఎన్టీఆర్ జిల్లా (తొర్ర గుడిపాడు), ప్రకాశం (అ ద్దంకి), 47.4°C, ఏలూరు (అల్లిప ల్లి) 47.3°C, మార్కాపురం, పోల వరం 46.5°C – 46.6°C, నెల్లూరు (కావలి), గుంటూరు (తెనాలి) 46. 0°C – 46.4°C ఉష్ణోగ్రతలు నమో దు కావడంతో బిక్కుబిక్కుమంటూ కా లం వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఏపీలోని మొత్తం 18 జిల్లాల్లో పాదరసం 45 డిగ్రీల మార్కును దాటేసింది. దాదాపు 20 జిల్లాల్లోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు న మోదై జనజీవనాన్ని స్తంభింపజే శాయని వాతావరణ శాఖ అధికా రులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే వారం రోజుల పాటు మరింత ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రాణాలకు మించిన పని ఇంకేముంటుంది వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button