Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 8:08 am Posted by : praja deveena

TeluguStates terrible tragedy incidents : బిగ్ బ్రేకింగ్, తెలుగురాష్ట్రాల్లో మూడుక్రూరఘటనలు, ఇద్దరు వృద్ధురాళ్ళు, చిన్నారిబలి

 

TeluguStates terrible tragedy incidents : ప్రజా దీ వెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో రెండు క్రూర ఘట నలు చోటు చేసుకున్నాయి. ఈ రెం డు ఘటనలు సమా జంలో పెరుగు తున్న క్రూరత్వానికి నిలువెత్తు నిద ర్శనంగా నిలుస్తున్నాయి. డబ్బు కో సం ప్రాణాలనుతీసే ఈ దారుణా లు ఎప్పటికీ మానవత్వాన్ని ప్రశ్నిం చేవిగా చరిత్రలో నిలిచి పోయాయి.తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి వృద్ధురాళ్ల ను టార్గెట్ చేస్తూ జరు గుతున్న హత్యలు కలకలం సృష్టి స్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం సంచలనం సృ ష్టిస్తోంది.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లిలో జరిగిన ఈ ఘటన ఊరిని ఒక్కసారిగా కుదిపేసింది. ఒంటరిగా జీవిస్తూ తన జీవితాన్ని గడుపుతున్న పద్మమ్మ (65) అనూహ్యంగా మృతిగా కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప క్కిం టివారు అనుమానం వచ్చి ఇం ట్లోకి వెళ్లిచూడగా ఆమె ప్రా ణాలు కోల్పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు స మాచారం అందించారు.

జీవితంలో ఎన్నోకష్టాలు ఎదుర్కొన్న పద్మమ్మ భర్త పదవీ వి రమణ తర్వాత అనారోగ్యంతో చనిపోవ డం, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడo ఈ దెబ్బల తర్వాత ఆ మె ఒంటరిగానే జీవిస్తోంది.అయితే ఈ దారుణానికి కార ణం పింఛన్ డబ్బులేనని స్థానికు లు అనుమానిస్తున్నారు. ఆమె ముఖం,ఛాతిపై గాయాలు ఉండటం హత్యను సూచి స్తున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.

     అమ్మిరెడ్డిపల్లిలో ఘోర అమానుషం

నారాయణపేట మండలం అమ్మిరె డ్డిపల్లిలో జరిగిన మరో ఘటన హృదయాలను పిండేస్తోంది. కేవలం నాలుగేళ్ల చి న్నారి తేజశ్రీ అవ్వ, తాతతో బయట నిద్రిస్తున్న సమ యం లో దుండగుల కంటపడింది. రాత్రి చీకటిని ఆసరాగా చేసు కుని ఆమెను ఎత్తుకెళ్లి, గొంతునులిమి చంపారు.

తర్వాత గ్రామ చెరువు వద్ద ఆమె మృతదేహాన్ని పడేసి, కా ళ్లకు ఉన్న వెండి పట్టీలు అపహరించారు.ఒక చిన్నారి ప్రా ణం కేవలం కొద్ది వెండి కోసం బలైపోవడం గ్రామాన్ని ది గ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు ఈ మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

     పార్వతీపురం మన్యం జిల్లాలో

పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సం ఘ టన భవిష్యత్తుకి ఒక హెచ్చరికలా నిలుస్తుంది. డిజిటల్ ప్ర పంచం మన జీవితాల్లోకి ఎంత లోతుగా చేరుతుందో, అది మనుషుల ఆలోచ న లను ఎలా మలుపుతిప్పుతుందో ఈ దారుణం స్పష్టంగా చూపిస్తుంది.

ఈశ్వరరావు అనే వ్యక్తి, అప్పుల బారిన పడి ఆన్‌లైన్ గేమిం గ్‌కు బానిసగా మారిపోయాడు. మొదట వినోదంగా మొదలై న ఆ అలవాటు, క్రమంగా అతని జీవితాన్ని పూర్తిగా కమ్మే సింది. అప్పులు పెరిగిపో యాయి, ఆశలు కరిగిపోయాయి. డబ్బు కోసం అతని ఆలోచనలు చీ కటి వైపు దారితప్పా యి.చివరికి అతడు తీసుకున్న నిర్ణ యం అమానుషంగా మారింది.

త నకు సొంత మేనత్తలాంటిదైన ఓ వృద్ధురాలిని, బంగారం కోసం హ త్య చేయడం ద్వారా అతను మా నవ త్వాన్ని మరిచిపోయాడు.ఈ సంఘటన కేవలం ఒక నేరం కా కుండా ఇది మన సమా జానికి ఒక గంభీరమైన హెచ్చరిక లాంటిది. టెక్నాలజీని ఎ లా ఉపయోగించా లో తెలియక పోతే, అది మనల్ని ఎలా నాశనం చేయగలదో గుర్తు చేస్తున్నాయి ఈ దారుణాలు.