TGHRC SuoMotu Action : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే టీ జీహెచ్ఆర్సీ మరోసారి చురుకైన చర్యల కు సిద్ధమవుతోంది. భవిష్య త్తులో మరింత బాధ్యతాయుత మైన సమాజాన్ని నిర్మించాలనే ల క్ష్యంతో రెండు ఆందోళన కర ఘటనలను స్వయంగా (SUO-MOTU) స్వీకరించింది. బుధవారం తెలం గాణ మానవ హక్కుల సంఘం చైర్ పర్స న్ డా. జస్టిస్ షమీమ్ అ ఖ్త ర్ నాయకత్వంలో కమిషన్ ఈ ని ర్ణయం తీసుకుంది. వార్త ప్రసార మాధ్యమాల ద్వారా వె లుగులోకి వచ్చిన ఈ సంఘటనలు సమాజంలోని విలువ లు, భద్రతా వ్యవస్థ ల పై కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్న సందర్భంలో హెచ్ ఆర్ సీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కమిషన్ వెల్లడించిన వివరాల ప్ర కారం మొదటి ఘటనలో ఖమ్మం జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు—82 ఏళ్ల భూక్య బిక్య(82), ఏళ్ల హంపిలి (79) తమ సం తానమే తమను నిర్లక్ష్యం చే యబోతున్న పరిస్థితి వెలుగు లోకి వచ్చింది. “అమ్మానాన్నలు అంత చేదయ్యారా..?” అనే హృదయ వి దారక కథనం సమాజాన్ని ఆలోచనలో పడేసే లా మారిన నేపద్యంలో వృద్ధుల సంరక్షణపై కొత్త చర్చలకు ఇది నాంది పలకింది.
ఇక రెండవ ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలు గేళ్ల చి న్నారి వీధి కుక్కల దాడికి గురై ఒక కన్ను కోల్పోయే విషాదం చోటుచే సుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘ టన ప్రజల భద్రతపై తీవ్ర మై న సందేహాలను రేకెత్తించడం తో పాటు, పట్టణాలలో జంతు నియంత్ర ణ వ్యవస్థలపై కఠి న చర్యలు అవ సరమని భావించి హెచ్ఆర్ సీ సీరియస్ గా తీసుకుంది.
ఈ రెండు ఘటనలకు సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా సమ గ్ర నివే దికలు కోరుతూ బాధితుల పునరావాసం, అధికారు ల చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృ తం కాకుండా తీసుకోబోయే నివారణ చర్యలు తదితర వివ రంగా సమర్పించాల్సి ఉంటుందని కమిషన్ ఆదేశాలు జారీ చేసిం ది.
27 ఏప్రిల్ 2026 నాటికి ఈ నివేది కలు అందించాల్సి ఉం టుందని, దాంతో అప్పటికి ఈ కేసులు మరింత కీలక మలు పు తిప్పనున్నాయ ని, ఈ చర్యలు కేవలం విచారణతో ము గియకుండా, సమాజంలో బా ధ్యత, మానవత్వం, భద్రతల ను మరింత బలపరిచే దిశగా మార్పు లకు దారితీయను న్నాయని కమి షన్ అధికారులు భావిస్తున్నారు.
