Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 3:41 pm Posted by : praja deveena

TGModelCodeofConductforElections : బిగ్ బ్రేకింగ్, ఎన్నికలసంఘం స్పష్టీకరణ, ఏకగ్రీవ గ్రామపంచాయతీల్లోనూ చివరివరకు ఎన్నికల ప్రవర్తననియమావళి

 

TGModelCodeofConductforElections : ప్రజా దీవెన, హై దరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏకగ్రీవ గ్రామపంచాయతీల లో సైతం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎ న్నికల ప్రవర్తన నియ మావళి అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్ని కల సంఘం కమిషనర్ రాణీకుముదిని తెలిపారు. గ్రామపంచాయ తీ ఎన్నికల సందర్భంగా ప్రవ ర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆమె చెప్పారు. గు రువారం ఆమె హైదరాబాద్ నుండి జిల్లాలకు కేటాయించబడిన ఎన్ని క ల పరిశీల కులు, జిల్లాల కలెక్ట ర్లు, పంచాయితీ రాజ్, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టీకరించారు.

స్టేజ్ 2, జోనల్ అధికారులకు శిక్షణ , సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యా లెట్ ఏ ర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పు ల పంపిణీ షెడ్యూల్ తదితర అంశా లపై కమిషనర్ ఆయా జిల్లాల వారీగా సమీక్షించా రు. రాష్ట్రంలోనికొన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనప్ప టికీ ఎన్నికలు ముగిసే వర కు అన్ని గ్రామ పంచాయతీల పరిధి లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఉంటుందని తెలిపారు.

ఎన్నికలకు సంబంధించి అన్ని ని బంధనలు తు.చ తప్పకుండా పా టించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియ మాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉపస ర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏ ర్పాటు, నామినేషన్ల పై వచ్చే ఫిర్యా దులు, తదితర అంశాల పట్ల ఎన్ని కల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వా ర్డు సభ్యు లంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామా లలో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడా లన్నారు.

ఫారం -10 ప్రకారం ఫలితాల ప్రకట న చేపట్టాలని అన్నారు.గ్రామ పం చాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు ,ఐఏఎస్ అధికారిణి కొర్రా లక్ష్మీ,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, అదన పు ఎస్పీ రమేష్, పంచాయతీ అధి కారి వెంకయ్య, జెడ్పి సీఈఓ శ్రీనివా సరావు, న ల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డిఅధికారులు తదితరులున్నారు.