Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 1:52 pm Posted by : praja deveena

Thamilnadu sensational liquor polocy : తమిళనాడు సీఎం విజయ్ సంచ లన నిర్ణయం, మద్యం వయసు పరిమితి 18 నుంచి 21ఏళ్లకు పెంపు

 

Thamilnadu sensational liquor polocy : ప్రజా దీవె న, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి గా ప్రముఖ సినీ న టుడు విజయ్ బాధ్యతలు చేపట్టి న తర్వాత రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ తన మార్క్ పాలనతో దూ సుకుపోతు న్నారు. కేవలం ప్రకటన లకే పరిమితం కాకుండా, సామాజి క మార్పు కోసం ఆయన తీసుకుం టున్న నిర్ణయాలు ఇప్పు డు చర్చో పచర్చలుగా కొనసాగుతూ ఆసక్తి నెలకొల్పాయి. తాజాగా మద్యం పాలసీపై సీఎం విజయ్ తీసుకున్న “బిగ్ డెసిషన్” వివరాలు ప్రకారం మద్యం వయసు పరిమితిని 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ తాజా నిర్ణయం తమిళనా డులో ఇప్ప టివరకు 18 ఏళ్లు నిండిన వారికి మద్యం విక్ర యించే వెసులుబాటు ఉండేది.

అయితే, యువత భవి ష్య త్తును దృష్టిలో ఉంచుకుని సీ ఎం విజయ్ ఈ వయసు పరి మితిని 21 ఏళ్లకు పెంచుతూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇకపై 21ఏళ్ల లోపు ఉన్న వారికి వైన్ షాపుల్లో మ ద్యం విక్ర యించరు గాక వి క్రయించరు. అదే సమయంలో బార్‌లు, పబ్‌ల లోకి కూడా 21 ఏళ్లు నిండిన వారికి మాత్ర మే ప్రవేశం ఉంటుందని ప్ర భుత్వం తీసుకున్న తాజా నిర్ణ యం ప్రకారం తెలుస్తోంది.

  ఉన్నఫళంగా సూచిక బోర్డుల మార్పు

 

18 ఏళ్లు” అని ఉన్న పాత బోర్డుల స్థానంలో, “21 ఏళ్లు నిం డిన వారికి మాత్రమే” అనే కొత్త హెచ్చరిక బో ర్డులను తప్ప నిసరిగా ఏర్పాటు చే యాలని ప్రభుత్వం స్పష్టం చేసిం ది. ఐ డీ కార్డ్ ఉంటేనే ‘మందు’.. లే దంటే ‘నో’ అంటూ కుండబద్ద లు కొట్టినట్లు చెబుతోంది. వయసు వి షయంలో ఎటువంటి మోసాలకు తావులేకుండా ప్రభుత్వం కఠిన ని బంధనలను అమలులోకి తెచ్చింది.

మద్యం కొనుగోలు చేసే సమ యం లో విక్రయదారులకు అ నుమానం వస్తే, కస్టమర్లు తప్పనిసరిగా తమ వయసు ధృవీ కరణ పత్రాన్ని చూ పించాల్సి ఉంటుంది.ఆధార్ కార్డ్, డ్రై వింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్ తదితర గుర్తింపు కార్డులతో 21 ఏ ళ్లు పైబడిన వారిని మాత్రమే అను మతించను న్నా రు. ఇదిలా ఉండగా సామాజిక బాధ్య త దిశగా సీఎం విజ య్ అడుగులు వేస్తున్నారు.నిన్ననే రాష్ట్రవ్యాప్తంగా దేవాల యాలు, పాఠశాలలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 మ ద్యం దుకాణాలను మూసి వే స్తూ విజయ్ సంచలన నిర్ణ యం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం తాలూకు వేడి తగ్గకముం దే, వయసు పరిమితిని పెంచుతూ తీసుకు న్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడులో మద్యం విక్రయా లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నే (TAS MAC) జరుగుతాయి, కాబట్టి ఈ రూల్స్‌ను అతి క్రమిస్తే కఠిన చర్య లు తప్పవని సర్కార్ హెచ్చరించిం ది. మొత్తానికి తమిళనాడు సీఎం గా విజయ్ బాధ్యతలు చే ప ట్టిన తర్వాత పరిపాలనలో పెను మా ర్పులు చోటు చేసు కుంటున్నాయ ని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.