The Congress Party is run by a thief who steals the vote: ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నాడు
అప్పుడు సీటుకో రేటు పెట్టినోడు ఇప్పుడు సీట్లు అమ్ముకుంటుండు -- అవకాశం ఇస్తే రేపటి నాడు రాష్ట్రాన్ని అమ్ముకుంటడు -- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి -- కరెంటు తీగలు పట్టుకుంటే కదా కరెంటు ఉందో లేదో తెలిసేది -- వారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీ లు నమ్మితే నట్టేట ముంచుతారు -- ప్రధాని మోడీ అన్నట్టుగానే నూరుశాతం మాది కుటుంబ పాలనే -- మాది మహాత్మా గాంధీ వారసత్వమైతే మోడీది గాడ్సే వారసత్వం -- అభివృద్ధిలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిల రాజీలేని కృషితో మెట్రో నగరాలను తలపిస్తున్నాయి -- మంత్రి జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి లు చేసిన అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలి -- నల్లగొండ, సూర్యాపేట లో ప్రగతి నివేదిక సభల్లో ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నాడు
— అప్పుడు సీటుకో రేటు పెట్టినోడు ఇప్పుడు సీట్లు అమ్ముకుంటుండు
— అవకాశం ఇస్తే రేపటి నాడు రాష్ట్రాన్ని అమ్ముకుంటడు
— కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి
దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి
— కరెంటు తీగలు పట్టుకుంటే కదా కరెంటు ఉందో లేదో తెలిసేది
— వారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీ లు నమ్మితే నట్టేట ముంచుతారు
— ప్రధాని మోడీ అన్నట్టుగానే నూరుశాతం మాది కుటుంబ పాలనే
— మాది మహాత్మా గాంధీ వారసత్వమైతే మోడీది గాడ్సే వారసత్వం
— అభివృద్ధిలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిల రాజీలేని కృషితో మెట్రో నగరాలను తలపిస్తున్నాయి
— మంత్రి జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి లు చేసిన అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలి
— నల్లగొండ, సూర్యాపేట లో ప్రగతి నివేదిక సభల్లో ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ప్రజా దీవెన/నల్లగొండ: ఓటుకు నోటు దొంగ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అప్పుడు సీటుకో రేటు పెట్టినోడు ఇప్పుడు సీట్లు అమ్ముకుంటుండని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవకాశం ఇస్తే రేపటి నాడు రాష్ట్రాన్ని అమ్ముకుంటడని ఎద్దేవా చేశారు.
ఇంకో నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని, అదే సందర్భంలో కరెంటు గురించి కోతల రాయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా మాట్లాడుతున్నాడు, కరెంటు తీగలు పట్టుకుంటే కదా కరెంటు ఉందో లేదో తెలిసేది అని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ వారంటీ లేని ఆరు గ్యారంటీ లు నమ్మితే నట్టేట ముంచుతారని హెచ్చరించారు.
నల్లగొండ, సూర్యాపేటలలో ఐటీ హబ్ ల తో పాటు అభివృద్ది పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసిన అనంతరం సూర్యాపేట జూనియర్ కళాశాల, నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానాలలో వేర్వేరుగా జరిగిన ప్రగతి నివేదన బహిరంగ సభలలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి విషయంలొ మంత్రి జగదీష్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాజీలేని కృషి, నిరంతర కఠోర శ్రమ తో నల్లగొండ, సూర్యపేట జిల్లా కేంద్రాలు మెట్రో నగరాలను తలపిస్తున్నాయని అభినందించారు.
సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి, నల్లగొండలో కంచర్ల భూపాల్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి కనీసం 50వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ బిజెపి బిజెపి లపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దామా? అని ప్రజలను ప్రశ్నించారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మళ్లీ ఒకసారి చాన్స్ ఇవ్వండి అని అడుగడం కాంగ్రెస్ సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అన్నారు. వారి పరిపాలనలో కాలిపోయే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు. ఎరువుల కొరత, విత్తనాలను పోలీసు స్టేషన్లో ఉంచి పంచిపెట్టిన దుస్థితి ఉండేదని ప్రజలకు గుర్తు చేశారు.
అలాంటి వారికి ఓటేస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారని అన్నారు. ఒక్కోసీటుకు ఒక్కో రేటు పెట్టి అమ్ముకుంటున్న నాయకుడు రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడో లేదో ఆలోచించండి అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 75 ఏండ్లలో ఎవరూ చేయని పనులు చేసుకున్నాం ,చేసుకుంటున్నాం అన్నారు. ఏ ప్రధాని, ఏ సీఎం ఆలోచన చేయని విధంగా రైతుబంధు కింద డబ్బులు జమ చేస్తున్నాం అన్నారు.
ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ చేశాం అన్న కేటీఆర్ ఇటువంటి పథకం దేశంలో మరి ఎక్కడా లేదన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తూ వారి కుటుంబాల్లో కెసిఆర్ పెద్దకొడుకులా మారడని అన్నారు దళితబంధులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదని కేటీఆర్ అన్నారు.
రోడ్ల మీద చెప్పులు కుట్టే 18 కుటుంబాలకు దళిత బంధు అమలు చేసి ఇచ్చారని, మేం అడగకుండానే మాకు దళితబందు ఇచ్చారని లబ్దిదారులు అంటున్నారని ఆయన వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇలా పంపిణీ విషయంలో కూడా లబ్ధిదారుల ముందే డ్రా తీసి ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎంపిక చేయడం బిఆర్ఎస్ ప్రభుత్వానికి, మా ప్రజా ప్రతినిధుల నిజాయితీకి నిదర్శనం అన్నారు.
2014కు ముందు కరెంట్ కష్టాలు రైతులను ముప్పు తిప్పలు పెట్టేవన్నారు. నాడు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు అయ్యాక స్నానాలకు బావుల వద్దకు పోతే కరెంట్ ఉండేది కాదని కేటీఆర్ గుర్తు చేశారు. బావుల కాడ స్నానం చేయలేని దుస్థితి ఉండేదన్న మంత్రి, ఏనాడూ మూడు గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు. 24 గంటల కరెంట్ వస్తలేదని కోమటిరెడ్డి అనడం ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనం అన్నారు.
- 24 గంటలు కరెంట్ వస్తే రాజీనామా చేస్తానని అంటున్న వెంకట్ రెడ్డి కి అనుమానం ఎక్కువని, మీ కాంగ్రెస్ నాయకులు అందరూ ఎక్కడికి వస్తారో అక్కడికి రండి బస్సులు మేం పెడుతాం. ఖర్చు మాదేనంటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాని రాష్ట్రంలోని ఏ గ్రామానికి పోతారో మాకు అభ్యంతరం లేదని, ఏ టైంకు పోతారో పోండి అందరూ మంచిగా లైన్లో నిలబడి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకోండి, కరెంటో వస్తుందో లేదో తెలిసిపోతది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తమ పాలన లో కరెంట్, మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు కాంగ్రెస్ నాయకులని పేర్కొన్నారు. సాగునీరు, కరెంట్, మంచినీరు ఇచ్చి కేసీఆర్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. సూర్యాపేటలో పోటీ చేస్తే ఎవరికి డిపాజిట్ దక్కుదో తెలుస్తుందన్న మంత్రి దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
150 ఏండ్ల కింద పుట్టిన కాంగ్రెస్ పార్టీకి వారెంటీ లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం లాంటి దిక్కుమాలిన పార్టీ అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్ ఇవ్వలేనోడు ఇప్పుడు 4 వేల పెన్షన్ ఇస్తామంటే నమ్ముదామా..? నమ్మి ఆగం కావొద్దు.. ఆరు దశాబ్దాల పాటు ఆగం చేసినోళ్లు ఆరు గ్యారెంటీలు అని డైలాగులు కొడితే నమ్మి మోసపోదామా? సూర్యాపేట, నల్లగొండ లలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేయలేని అభివృద్ధిని తొమ్మిది నెలలోనే మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేశారని కొనియాడారు.
సూర్యాపేటలో కొత్త కొత్త షాపింగ్ మాల్స్, ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థలు వస్తున్నాయంటే అది ఇక్కడ జరిగిన అభివృద్ధితోనే అన్నారు. దత్తత తీసుకున్న నల్లగొండ నియోజకవర్గం ఏడాది కాలంలోనే రూపులేఖలు మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. నల్లగొండ, సూర్యాపేటలో ఉన్న ప్రశాంత వాతావరణన్ని ఇదేవిధంగా కొనసాగించడానికి ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్లేందుకు మంత్రి జగదీష్ రెడ్డికి, నల్లగొండ లో భూపాల్ రెడ్డి కి మరోసారి ఇక్కడ ప్రజానీకం అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అంగవైకల్యం మీద మాట్లాడిన వాళ్లకు నెత్తి సరిగా లేదని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నల్లగొండ సూర్యపేటలలో ఐటీ హబ్ లు నిర్మితమైనాయని అభినందించారు. మంత్రి జగదీష్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిల అధ్యక్షతన వేరువేరుగా జరిగిన ఈ సభల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, రవీంద్ర కుమార్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్ , మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.