The death of Siyasat Magazine MD Zaheer Ali Khan is sad సియాసత్ పత్రిక ఎండి జహీర్ అలీ ఖాన్ మృతి బాధాకరం
సియాసత్ పత్రిక ఎండి జహీర్ అలీ ఖాన్ మృతి బాధాకరం
— తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన tuwj
ప్రజా దీవెన/హైదరాబాద్: సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. గద్దర్ అంత్యక్రియల సమయంలో అసువులు బాసిన జహీర్ అలీ ఖాన్ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి అన్ని ప్రజా సంఘాలతో కలిసి ప్రయాణం చేసిన ఆయన ఈ రకంగా అర్థాంతరంగా తనువు చాలించడం బాధాకరం అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ,ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ లు పేర్కొన్నారు. జర్నలిస్ట్ సమాజానికి కూడా ఆయన మరణం తీరని లోటు అన్నారు. సతాపం తెలిపిన వారిలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హజారే, తేంజు అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్,ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ లు ఉన్నారు.