The ongoing influx into the Congress: కాంగ్రెస్ లోకి కొనసాగుతోన్న చేరికల పర్వం
--నల్లగొండ లో మరో ఇద్దరు బిఅర్ఎస్ కౌన్సిలర్ల చేరిక --పలువురు స్ధానిక ప్రజా ప్రతినిధుల కూడా -- బిఅర్ఎస్ కు వరుస వలసల షాక్ ల మీద షాక్ లు
కాంగ్రెస్ లోకి కొనసాగుతోన్న చేరికల పర్వం
–నల్లగొండ లో మరో ఇద్దరు బిఅర్ఎస్ కౌన్సిలర్ల చేరిక
–పలువురు స్ధానిక ప్రజా ప్రతినిధుల కూడా
— బిఅర్ఎస్ కు వరుస వలసల షాక్ ల మీద షాక్ లు
ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గంలో అధికార బిఆర్ఎస్ పార్టీకి మరోమారు షాక్ తగిలింది. బుధవారం బిఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్ లు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తో పాటు ఐదుగురు కౌన్సిలర్లు, తిప్పర్తి మండలం రామలింగాలగూడెం ఎంపీటీసీ, కనగల్ మండలం పొనుగోడు సర్పంచులు సైతం ఎంపీ సమక్షంలో హస్తం గూటికి చేరారు.
దీంతో అధికార బిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ లు తగులుతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం చేరికల జోష్ పెరిగుతోంది. నల్లగొండ మున్సిపాలిటీలో మూడుసార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన బోయినపల్లి శ్రీనివాస్, రెండుసార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన ఎండి సమీలు బుధవారం ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారికి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్లు పార్టీలో చేరిన సందర్భంగా ఎంపి కోమటిరెడ్డి మాట్లాడుతూ రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.
ఆరు గ్యారంటీ స్కీములను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీములతో పాటు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో నియోజకవర్గంలో పలువురు ఎంపీపీలు, జడ్పిటిసి, సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పారు.
*దోనకల్ గ్రామంలో…* నల్లగొండ మండలం దోనకల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య ల సమక్షంలో 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో దోనకల్ గ్రామ మాజీ సర్పంచ్ అయ్యాడపు ప్రకాష్ రెడ్డి, తండు సత్తయ్య, కొత్తపల్లి పెద్ద పెంటయ్య, పాలకూరి స్వామి, తండు సత్తయ్య, కొత్తపల్లి యాదయ్య, ఏశబోయిన బుచ్చాలు, పాలకూరి సత్తయ్య, తండు అంజయ్య, యాస బీమార్జున్ రెడ్డి, స్వామి రెడ్డి, కొత్తపల్లి వెంకన్న, మంగదొడ్లు బిక్షమయ్య, యాసజాన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంగల్ రెడ్డి, కోమటిరెడ్డి సత్తిరెడ్డి, తండా వెంకటయ్య, పాలకూరి గణేష్, కోమటిరెడ్డి యశ్వంత్ రెడ్డిలు ఉన్నారు.
*గంగన్నపాలెం గ్రామంలో…* తిప్పర్తి మండలం గంగన్న పాలెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూపూడి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా హస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాదూరి శ్రీనివాసరెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.