There were doubts from the beginning: అరంభం నుంచి అనుమానాలున్నాయి
--కాళేశ్వరo ప్రాజెక్టు సందర్శించిన మంత్రుల బృందం --మేడిగడ్డ కుంగిన నాటి నుంచి కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు --కాలేశ్వరం కంటే ప్రాణహిత ప్రాజెక్టు ఉత్తమమైనది --ప్రాజెక్టులో నష్టానికి కట్టిన వారే బాధ్యత వహించాలి -- ప్రాజెక్టు వద్ద మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
అరంభం నుంచి అనుమానాలున్నాయి
–కాళేశ్వరo ప్రాజెక్టు సందర్శించిన మంత్రుల బృందం
–మేడిగడ్డ కుంగిన నాటి నుంచి కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు
–కాలేశ్వరం కంటే ప్రాణహిత ప్రాజెక్టు ఉత్తమమైనది
–ప్రాజెక్టులో నష్టానికి కట్టిన వారే బాధ్యత వహించాలి
— ప్రాజెక్టు వద్ద మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
ప్రజా దీవెన/కాళేశ్వరo: కాళేశ్వరo ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం శుక్రవారం పరిశీ లించింది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి లు మధ్యాహ్నం బ్యారేజీ వద్దకు చేరుకోగా అంతకు ముందు విహంగ వీక్షణం ద్వారా ఆనకట్టను పరిశీలించారు. ఆయా మంత్రుల తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ కూడా ఉన్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
ఈ సంద ర్భంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ కుంగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరo ప్రారంభించి నప్పటి నుంచి అందరికీ అనుమానాలు ఉన్నాయని, మేడిగడ్డ కృంగినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ఒక్క మారు కూడా స్పందించలేదని గుర్తు చేశారు. కాళేశ్వరo దాని అనుబంధ ప్రాజెక్టులపై న్యాయ విచా రణ జరుపుతామని తాము అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగిందని తెలిపారు.
కాళేశ్వరo కంటే ప్రాణహితే ఉత్తమమైనదని అంటూ మహారాష్ట్రలో కొంతముంపుతో ప్రాణహిత ప్రాజెక్టు పూర్తయ్యేదని వివరించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 80 వేల కోట్ల నుంచి రూ. లక్ష న్నర కోట్లకు పెంచడం జరిగిందని పెదవి విరిచారు. మేడిగడ్డ కుoగ డమే కాకుం డా అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజ్ అయింద ని, ఇంకనూ సందిళ్ల ను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.
ప్రాజెక్టులో జరిగిన నష్టానికి కట్టిన వారే బాధ్యత వహించాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21వ తేదీన కుంగితే డిసెంబర్ 3వ తేదీన ప్రభుత్వం మారేవరకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకర మన్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం మేడిగడ్డ కుంగడం వల్ల ఎస్సారెస్పీ ఆయకట్టు మొత్తం ప్రశ్నార్థక మైందని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పరిస్థితి అంచనా వేయనున్నామని తక్కువ నష్టం జరిగి ఉండాలని మేము కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ప్రాజెక్టు పూర్తి వివరాలతో పాటు ప్రాజెక్టు ఖర్చు లు, సాంకేతిక పరమైన అంశాలు చివరగా లాభనష్టాలు తదితర అంశాలపై వివరంగా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లా డుతూ మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్ల సలహాలు తీసుకు న్నారా లేడం టే కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించారా అని అధికారులను ప్రశ్నించారు. మూడో టిఎంసి అవసరమే లేదని, సద రు ముడో టీఎం సీ ని కెసిఆర్ బంధువు కోసం చేశారా అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇంజనీర్లుగా సలహాలు ఇవ్వాలి, వారు వినక పోతే సెలవు పెట్టి వెళ్ళి పోవాలి అని సమాధానం చెప్పాలని అధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.