Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

They went for sale, not development: అభివృద్ధిని కాదని అంగట్లో అమ్మకానికి వెళ్ళారు

-- పార్టీ మారిన బిఅర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగిన భూపాల్ రెడ్డి -- ప్రగతి నిరోధకులకు విజ్ఞులైన ప్రజలే బుద్ధిచెబుతారు --నలగొండ అభివృద్దిని చూసి మళ్లీ అదరించoడి -- నల్లగొండ బి ఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి

అభివృద్ధిని కాదని అంగట్లో అమ్మకానికి వెళ్ళారు

— పార్టీ మారిన బిఅర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగిన భూపాల్ రెడ్డి
— ప్రగతి నిరోధకులకు విజ్ఞులైన ప్రజలే బుద్ధిచెబుతారు
–నలగొండ అభివృద్దిని చూసి మళ్లీ అదరించoడి
— నల్లగొండ బి ఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాదని కొందరు అంగట్లో సరకుల్లా అమ్ముడుపోయారని ( Some of them were sold like commodities instead of development and welfare schemes)  నల్లగొండ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి ద్వజమెత్తారు. గురువారo బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పలు వార్డుల నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పుట్టకోటయ్య ముదిరాజ్, పుట్ట చంద్రశేఖర్ ముదిరాజ్, సింగారపు విజయ్, సింగారపు నరేష్, సంతోష్, కోటి తదితరులు తమ అనుచరులతో, గోగుల యాదగిరి బయ్య కృష్ణ తమ అనుచరులతో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండ నందన వనంగా అభివృద్ధి చెందుతుంటే ( Nalgonda adopted by KCR is developing as Nandana Vanam) కొంతమంది కోమటిరెడ్డి ఇచ్చే నోట్ల కట్టలకు ఆశపడి పట్టణాభివృద్ధి విస్మరించి ప్రగతి నిరోధకులుగా మారారని తీవ్రంగా విమర్శించారు.

రాజకీయ చైతన్యవంతులైన నల్లగొండ నియోజకవర్గం ప్రజలు పట్టణ అభివృద్ధిని కాంక్షిoచి ( The people of Nalgonda Constituency, who are politically active, aspire for urban development) కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు మోసపోరని ఆశాభావం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న అభివృద్ధిని చూసి నల్లగొండ ప్రజలు తనను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగం రామ్మోహన్, సింగం లక్ష్మి కౌన్సిలర్లు శ్రీనివాస్ యాదవ్, వట్టిపల్లి శ్రీనివాస్, రంజిత్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు, ప్రసన్న, సిరాజ్ , కాజా శ్రీసంతోష్ కుమార్, హరి, శంకర్ గౌడ్, ఉపేందర్, నారి, యాదగిరి, నరేష్, సైదులు, విజయ్ పాల్గొన్నారు.