
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మొదటి వి డత గ్రామపంచాయతీ ఎన్నికలు ని ర్వహించనున్న పో లింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరి శీలకురాలు, ఐఏ ఎస్ అ ధికారి కొర్రాలక్ష్మీ సమక్షంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో వి జయవంతంగా నిర్వహించడం జరి గింది. నల్గొండ ,చండూరు డివిజన్ల లోని 14 మండలాలలో మొద టి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలి సిందే.
చండూరు, చిట్యాల, గట్టుప్పల్, క నగల్, కట్టంగూరు, కేతేపల్లి, మ ర్రిగూడ, మునుగోడు, నకిరేకల్, న ల్గొండ, నాంపల్లి, నార్కెట్ పల్లి, శాలిగౌరారం, తిప్పర్తి మండలాలలోని 2870 పోలింగ్ కేంద్రాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇం దుకు గాను పి ఓఓపిఓ లు రెండవ ఓపిఓ మొత్తం కలుపుకొని 78 92 మందిని వి ధు లు నిర్వహించే విధంగా రాండ మైజేషన్ కార్య క్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఇందులో పిఓలు 3444 , ఓపిఓలు 4448 మంది ఈ ర్యాండమై జేషన్ లో ఆయా పోలింగ్ కేంద్రాలకు సి బ్బందిని కేటాయించారు. ఈ కా ర్య క్రమానికి స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ నారా యణ అమిత్, రెవెన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పం చాయతీ అధికారి వెంకయ్య, జెడ్పి సీఈఓ శ్రీనివాస రావు, నల్గొండ ఆర్డీవో వై అశోక్ రె డ్డి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతి లాల్, ఈ-డి యం దుర్గారావు, ఎన్ ఐసి అధికారులు ప్రేమ్, తదితరులు హాజర య్యారు.
పకడ్బందీగా గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వ హించాలి… పకడ్బందీగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీ గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సా మాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బా క్సులను పరిశీలించారు. అలాగే సా యిరాం ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి అక్కడ కావలసిన పో లింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పా ట్లను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారి గా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఓటరు జాబితా వివరాలు స రిగా ఉన్నాయో లేదో తనిఖీచేసుకోవా లన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్త గా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలి పారు. బ్యాలెట్ బాక్స్ లు అన్ని ఓ పెన్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలని, డిస్ట్రి బ్యూ షన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏ ర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు.
సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏ ర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజ నం కల్పించాలని,చివరిగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా బ స్సులను పంపించాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడా లన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, మూత్ర శాలలు, లైటింగ్, పా ర్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయేదారులలో ఎలాం టి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
జిల్లా పంచాయతీ అధికారి వెంక య్య, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జి ల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖ ర్ రెడ్డి , తహసిల్దార్ పద్మ, ఎంపీడీ వో వేద రక్షిత, ఎంఈఓ ప ద్మ కలెక్టర్ వెంట ఉన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ కేం ద్రంలో జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి పరి శీలన .…గ్రామపంచాయతీ ఎ న్నికల నేపధ్యంలో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం లో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మంగళవారం నల్గొండ మండల ప రిషత్ కార్యాల యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరి శీ లించారు. పోలింగ్ సామాగ్రి పంపి ణీకి అవసరమయ్యే ఏర్పాట్లను నల్లగొండ మండల కేంద్రంలోని ఇం ద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో డిస్ట్రి బ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అ ని, ఈ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఉద్యోగి నిబంధనలను ఖచ్చితంగా పాటిం చాలన్నారు.ఎన్నికల సామాగ్రిని ఉ ద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాలెట్ పంపిణీ, స్వీకరణ జరగాలన్నారు. ప్రతి బండిల్‌పై సీల్, సంతకాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా లన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ డిస్ట్రి బ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఎన్నికల సామాగ్రి సరఫరా వ్యవస్థ, రిసెప్షన్ రూమ్ కార్య కలా పాలను పరిశీలించారు. సామగ్రి పం పిణీ సమయంలో ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన సామాగ్రి సమయానికి అందించేం దుకు ప్రత్యే క డెస్కులు ఏర్పాటు చేయాలన్నా రు. బృందాలు వచ్చి న క్రమానుసారం రిజిస్ట్రేషన్ నుంచి మెటీరియల్ పంపిణీ వరకూ మార్గదర్శకాలు పాటించాలన్నారు.
ఎక్కడ ఆలసత్వం, అయోమయం తలెత్తకుండా తగిన సూచిక బో ర్డులు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భద్ర త, సీసీ కెమెరా పర్యవేక్షణ, పోలిం గ్ సిబ్బందికి త్రాగునీరు, వి శ్రాంతి గ దులు, వైద్య అత్యవసర సదుపాయాల లభ్యతపై అడిగి తెలుసుకున్నారు.జిల్లా పంచాయతీ అధికారి వెంక య్య, జడ్పీ సీఈ ఓ శ్రీనివాసరావు, ఆర్టీవో అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధి కారి శేఖర్ రెడ్డి, త హసిల్దార్. పరశురాం, ఎంపీడీవో యాకూబ్ నా యక్ లు కలెక్టర్ వెంట ఉన్నారు.





