రథ సప్తమికి సర్వం సిద్ధం, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
Thirumalathirupati : ప్రజా దీవెన, తిరుపతి: రథ సప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో చేసిన ఏర్పా ట్లను సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంక య్య చౌదరితో కలిసి పరిశీలిం చారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు.
పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు.అనంతరం ఈవో మీడి యాతో మాట్లాడుతూ మంగళవా రం రథసప్తమి పర్వదినం సందర్భం గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ఏడు వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారని తెలి పా రు.రథ సప్త మి సందర్భంగా రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వేసవి తాపం కలగ కుండా షెడ్లు ఏర్పాటు చేశామని, మాడ వీధుల్లో ఉన్న భక్తులకు ని రంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు.
రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ నిరం తరంగా కొనసాగుతుంద న్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశా మని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు రెట్లు అధిక భద్రత కల్పిస్తు న్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్ర హ్మం, ఇన్ ఛార్జ్ సీవీఎస్వో శ్రీ మణికంఠ చందోలు, జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.