three Ayyappa Swamas: అశువులుబాసిన అయ్యప్ప స్వాములు
--తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి --మృతులంతా ములుగు జిల్లా కమలాపురంకు చెందినవారే
అశువులుబాసిన అయ్యప్ప స్వాములు
–తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
–మృతులంతా ములుగు జిల్లా కమలాపురంకు చెందినవారే
ప్రజా దీవెన/ తమిళనాడు: అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకొని దైవ దర్శ నం తర్వాత తిరుగు ప్రయాణంలో ముగ్గురు అయ్యప్ప స్వాములు అశు వులు బాశారు. తమిళ నాడు రాష్ట్రం లో జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో వీరు దుర్మరణం పాలయ్యారు. కేరళ శబరిమల అయ్య ప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి దర్శనం పూర్తి చేసుకుని తి రుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వాములు ప్ర యాణి స్తున్న కారు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయా ణిస్తున్న మారుతి ఏర్టిగా వాహనం అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడం తో ముగ్గురు స్వాములు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా మరొ కరికి తీవ్ర గాయాలయ్యాయి.
కారులో మొత్తం ఐదుగురు భక్తులు ఉండగా గాయపడిన క్షతగాత్రు న్ని సమీప ఆస్పత్రికి తరలించి చికి త్స అందిస్తున్నారు. మృతులు ములుగు జిల్లా కమలాపురంకు చెంది న సుబ్బయ్య నాయుడు, నర సాంబయ్య, రాజుగా గుర్తించారు.
ఈ ప్రమాదం వివరాలు తెలియగా నే మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఈ ఘటనపై సమాచారం తెలుసుకు న్న తమిళనాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదే హాలను శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.