Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 7:20 am Posted by : praja deveena

Thungathurthy Congress Infighting Flares Up Again : బిగ్ బ్రేకింగ్, పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించిన ‘అర్వపల్లి’, కాంగ్రెస్ వ ర్గపోరుతో రణరంగమైన తుంగతు ర్తి

Thungathurthy Congress Infighting Flares Up Again : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో గత కొ ద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉ న్న ‘ప్రచ్చన్న యుద్ధం’ ఒక్క సారిగా రోడ్డుకెక్కింది. అర్వపల్లి మండల కేంద్రం బుధవారం ఉద యం ఇరువర్గాల దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లింది. సినిమా సీన్లను తలపించేలా సాగిన ఈ హైడ్రా మా నియోజకవర్గంలో తీవ్రకలకలం రేపిం ది.

గాంధీభవన్‌ టార్గెట్.. మధ్యలోనే అటాక్

ఎమ్మెల్యే వర్గానికి, పార్టీలోని సీని యర్ నాయకులకు మధ్య నడు స్తున్న తీవ్ర విభేదాల నేపథ్యంలో.. తమకు జరుగుతు న్న అన్యాయా న్ని అధిష్టానానికి మొరపెట్టుకోవ డానికి సీని యర్ నేతలు ‘చలో గాం ధీభవన్’ కార్యక్రమానికి పిలుపుని చ్చారు. దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వ ర్గానికి చెందిన సీనియర్ నాయకులంతా కలిసి ధరూర్ యో గానంద చారి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్‌తో హైదరాబా ద్‌కు బయలుదేరారు.

అయితే, ఈ పర్యటనను అడ్డుకు నేందుకు ఎమ్మెల్యే వర్గీ యులుగా భావిస్తున్న కొందరు ఒక్కసారిగా సీనియర్ల కాన్వా య్‌పై రాళ్లదాడికి ది గారు. దీంతో ఇరువర్గాలు రోడ్డుపైనే ప రస్పరం దాడులు, ప్రతిదాడు లు చేసుకోవడంతో అర్వపల్లి రణ రంగంగా మారింది.దాడుల్లో పలు విలాసవంతమైన కా ర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలకు చెందిన పలు వురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డా రు. జిల్లాలో ఇప్పటికే సెక్షన్ 30 అ మలులో ఉన్నప్పటికీ ఈ ఘర్షణ జరగడం గమ నార్హం. పరిస్థితి చేతు లు దాటడంతో పోలీసులు రంగప్ర వే శం చేసి, లాఠీఛార్జ్ చేసి జనాలను చెదరగొట్టారు.

వెనక్కి తగ్గని ‘యోగానందచారి’ కాన్వాయ్

పోలీసుల లాఠీఛార్జ్, ప్రత్యర్థుల రాళ్లదాడి సృష్టించిన బీభ త్సంలోనూ సీనియర్ నాయకుడు ధరూర్ యోగానంద చా రి ఏమాత్రం వెనక్కి త గ్గలేదు. తన కాన్వాయ్‌పై జరిగిన దా డిని ప్రతిఘటిస్తూనే, శ్రేణులను సమాయత్తం చేసుకుని హై దరాబాద్ వైపు దూసుకెళ్లారు. ఇప్పటికే ఈ వర్గానికి చెందిన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌ కు చేరుకున్న ట్లు సమాచారం.

అధిష్టానం మౌనం.. తటస్థుల్లో ఆందోళన

నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు ఇలా బహి రంగంగా వీధులకెక్కి కొట్టుకోవడం పై కాంగ్రెస్ తటస్థ నాయకులు, కా ర్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. గత వారం రోజులుగా అర్వపల్లి వేదికగా ఉద్రిక్త తలు పెరుగుతున్నా అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ, ఇటు జిల్లా డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య కానీ కనీసం జోక్యం చేసుకోకపోవడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మీడి యాలో ఈ విజువల్స్ హల్‌చల్ చేస్తున్నా జిల్లా మంత్రులు, పీసీసీ ఎందుకు మౌన వ్రతం వహించారనేది మిస్టరీగా మా రింది.

ఇప్పుడు అందరి కళ్లు గాంధీభవన్ పైనే..

ఈ హైడ్రామా ఇలా ఉంటే, ఇప్పు డు అందరిలోనూ ఒకటే ఉ త్కంఠ నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య, దాడులను తట్టుకు ని గాంధీభవన్‌ కు చేరుకున్న సీనియర్ నేతలకు అధిష్టందం పెద్దలు అపాయింట్‌ మెంట్ ఇస్తారా? వారి బాధలను వింటా రా? లేక తుంగతుర్తి పంచాయితీని ఇలాగే గాలికొదిలేస్తా రా? అనేది చూడాల్సి ఉందని పరిశీల కులు భావిస్తున్నారు.