Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 4:47 am Posted by : praja deveena

Tirupathi tragedy Auto accident : బిగ్ బ్రేకింగ్, తిరుపతిలో ఘోర విషాదం, నలుగురి ప్రాణాలు తీసిన ‘ఒక్క విజిల్’

 

Tirupathi tragedy Auto accident :   ప్రజా దీవెన, తి రుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఊహిం చని రీతిలో జరిగిన ఒక ఘోర రో డ్డు ప్రమాదం నలుగురు అమా యకుల ప్రాణాలను బలితీసుకుంది. అటవీ శాఖ సిబ్బంది ఊదిన ఒక్క విజిల్.. ఒకే కుటుంబానికి చెందిన వారిని, బం ధువులను కోలుకోలేని శోకంలో ముంచేసింది.బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వైపు కలప లోడ్‌ తో ఒక లారీ వెళ్తోంది. అ దే సమ యంలో చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరు మాళ్లపల్లి గ్రామాని కి చెందిన ఒకే కుటుంబానికి చెం ది న బంధువులు (మొత్తం 11 మం ది) తిరుపతిలో జరగబోయే ఒక వివాహ వేడుకకు హాజరయ్యేం దు కు ఆటోలో బయల్దే రారు.సరిగ్గా అటవీ శాఖ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే ఈ ఘోరం జరిగింది.

ఆఒక్క బ్రేక్.. అంతా అతలాకుతలం

విధి నిర్వహణలో ఉన్న అటవీ చెక్‌ పోస్ట్ సిబ్బంది లారీని ఆపడానికి ఒక్కసారిగా గట్టిగా విజిల్ ఊదా రు. ఆ శబ్దానికి ఒక్కసారిగా కంగా రుపడిన లారీ డ్రైవర్, ఏంజరుగుతుం దో నన్న ఆందోళనతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో లారీ వె నుకనే వేగంగా వస్తున్న ఆటో లారీ హఠాత్తుగా ఆగ డం తో అదుపు చేయలేక నేరుగా వెళ్లి లారీని బలంగా ఢీకొట్టింది.

నలుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

ఈ భీకర ప్రమాదంలో ఆటోలో ఉ న్నవారిలో నలుగురు అ క్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటో పూర్తిగా నుజ్జును జ్జవగా అందులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సం ఘ టనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తర లిం చారు. కళకళలాడాల్సిన పెళ్లి ఇల్లు.. ఈ ఘోర ప్రమాదంతో ఒక్కసారిగా శ్మశాన వైరాగ్యంగా మారిపోయింది. లారీ డ్రైవ ర్ ఆందోళన, చెక్‌పో స్ట్ సిబ్బంది అలసత్వం లేదా సమ య స్ఫూర్తి లోపమే ఈ ప్రమాదానికి కారణమనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి.