
Tolichowki SI ACB Trap : ప్రజా దీవెన, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ACB) సంచలన చర్య చేపట్టిం ది. గోల్కొండ జోన్‌లో ని టోలీచౌకీ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్. పాండు నాయక్ రూ.10 వేల లంచం తీ సుకుంటుండగా ACB అ ధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకా రం.. ఫి ర్యాదుదారు తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తన పై కేసు న మోదు చేయకుండా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య సమ స్యను సామరస్యంగా పరిష్కరించడం, అలాగే తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు సబ్ -ఇన్‌స్పెక్టర్ రూ.10,0 00 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోప ణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు అం దుకున్న ACB సిటీ రేంజ్-1 అధి కారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. లం చం మొత్తా న్ని స్వీకరిస్తున్న సమయంలో ఎ స్‌ఐ ఆర్. పాం డునాయక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ ఐ వద్ద ఉన్న రూ.10,000 లం చం సొమ్మును ఆయన సమక్షం లోనే ACB అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. అక్రమ ప్ర యోజనం పొందేందుకు తన అధికారిక విధులను అక్ర మంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించినట్లు ACB పే ర్కొంది.
నాంపల్లి కోర్టులో హాజరు
అనంతరం పాండు నాయక్‌ను ACB అధికారులు అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిఎదుట హాజరుపరచను న్నట్లు తెలిపా రు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్ర తా కారణాల దృ ష్ట్యా ఫిర్యాదుదారుడి పేరు, ఇతర వ్యక్తి గత వివరాలను ACB అధికారులు గోప్యంగా ఉంచారు.





