IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Tourism Minister Jupally Krishna Rao : మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్ర కటన, ప‌ర్యాట‌క కేంద్రాల్లో వీకెండ్ లో సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు

పర్యాటక ‘ప్రభ’ పెంచుతూ మేటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి --హైద‌రాబాద్ లో భారీ స్థాయిలో కార్నివ‌ల్ నిర్వ‌హ‌ణ‌ --ప‌ర్యాట‌క ప్రాజెక్ట్ ల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించండి --అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం

 

Tourism Minister Jupally Krishna Rao : ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి ప ర్యాటక గమ్యస్థానంగా ఎదిగేం దుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆదిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకు రావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థా నాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్ర మాలకు సంబం ధిం చి నిర్దిష్ట కాల పరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్ర ణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్ధే శం చేశారు. మంగ‌ళ‌వారం బేగంపే టలోని టూరిజం ప్లాజా లో నిర్వ హించిన పర్యాటక సలహా కమిటీ/ మండ‌లి (To urism Advisory Committee) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ రాష్ట్రంలోని వారస త్వ సంప ద, సంస్కృతి, అద్భుతమైన కట్టడాలు, ప్ర‌కృతి ర‌ మ‌ణీయ ప్ర‌దేశా లు, జ‌ల వ‌న‌రులు, ద‌ట్ట‌మైన అ డ‌ వులు, ఆధ్యాత్మిక కేంద్రాలను స మన్వయం చేస్తూ తెలంగాణను ఒ క శక్తివంతమైన పర్యాటక హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్ప ష్టం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకు లకు కనీస సౌకర్యాల క ల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యం గా మరుగు దొడ్లు, తాత్కాలిక వసతి గదులు, టెంట్లు, గ్లాస్ హౌస్‌లతో పాటు ర హదారి పక్కన ఉండే విశ్రాంతి సౌ కర్యా లను వెంటనే మెరుగుప‌ర్చా ల‌ని, కొత్త వాటిని ఏర్పాటు చే యాలన్నారు.

సలహా కమిటీ సమావేశంలో వెల్ల డైన ప్రతిపాదనలపై ఎప్ప టికప్పు డు సమీక్షలు నిర్వహించాలని, అ మలు ప్రక్రియలో జాప్యం జరగకుం డా ఒక నిర్దిష్ట పని లేదా ప్రాజెక్ట్ బా ధ్యత ను పర్యవేక్షించడానికి నోడల్ అధికారి (Point Person)కి అప్ప‌గించాల‌ని సూచించారు. దేశీ,విదేశీ పర్యాటకులను ఆ కర్షించేందుకు నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో హైదరా బాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్‌ నిర్వహణ‌కు అధ్య‌య‌ నం చేయాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌త్రిపాద‌న‌లు రూ పొందించి, స‌మ‌ ర్పించాల‌ని చెప్పారు. ప్రారంభంలో ప్రభు త్వమే దీనిని చేపట్టినా, భవి ష్యత్తులో ప్రైవేటు భాగస్వా మ్యం తో స్వయం సమృద్ధిగా సాగేలా చూడాలని తెలిపారు.

జీహెహెచ్ఎంసీ, హెచ్ఏండీఏ స‌మ‌న్వ‌యంతో నగర సుంద రీకరణ లో భాగంగా శిల్పాలు, ఆకర్షణీయ మైన ల్యాండ్‌ స్కే పింగ్‌, స్కై వాక్ లు సృజనాత్మక ఉట్టిప‌డేలా తీర్చి దిద్దాల‌ని ఉద్భోదించారు. రాష్ట్రం లోని సోమశిల, వరంగల్, రామ ప్ప, యాదాద్రి, గోల్కొండ, తారామతి బరాదరి, నాగార్జున సాగర్ వంటి కీలక పర్యాటక ప్రాంతాల్లో అ భివృద్ధి పనులను వేగం గా పూర్తి చే యాల‌ని మంత్రి ఆదేశించారు.ప ర్యాటకులను ఆక‌ట్టుకునేలా ప్రధాన ప‌ర్యాట‌క కేంద్రాల్లో క్రమం తప్ప కుం డా వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

స్పెష‌ల్ సీఎస్ వాణి ప్ర‌సాద్ మాట్లాడుతూ మ‌న రాష్ట్రంలో అద్బుత‌ మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, వ‌న‌రులు ఉన్నప్ప‌టి కీ,ప్ర‌చారంలో వెనుక‌ బ‌డి ఉన్నామని, దీనిపై ప్ర‌త్యేక దృ ష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నా రు. మరుగుదొడ్ల నిర్మాణం, కెరా వె న్ (Caravan) కోసం ఇప్పటికే ప్ర తిపాదనలు ఆహ్వా నించామ‌ని (E OI) చెప్పారు. పెండింగ్ లో ఉన్న హ‌రిత హో ట‌ళ్ల నిర్మాణం పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,వారసత్వ కట్ట డాల నిర్వహణ కోసం ‘ఆగాఖా న్’ మోడల్‌లో ట్రస్టులను ఏ ర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణ‌ను అంతర్జాతీయ స్థా యిలో వెడ్డింగ్ డెస్టినేషన్‌ గా తీర్చి దిద్దడంతో పాటు మెడికల్, వెల్నెస్, గోల్ఫ్, ఫిలిం, ఎ కో టూరిజం కేంద్రం గా ప్రచారం చేయాలని కమిటీ స భ్యు లు ఈ సమావేశంలో ప్రతిపా దించారు. ముఖ్యంగా మధ్య ప్రాచ్యం, సెంట్రల్ ఆసియా మార్కెట్ల లో విస్తృత మార్కెటిం గ్ కార్యక్ర మాలు చేపట్టాలని కమిటీ సభ్యు లు నొక్కి చెప్పా రు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా ఇన్వెస్ట ర్ అవుట్ రీచ్ కార్యక్రమా లు చేపట్టాలని, ప్రాజెక్టుల అమ లులో వేగం పెంచాలని సూచించారు.

తెలంగాణ‌లో ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దే శాల‌ను అద్బుత కేంద్రా లుగా తీర్చి దిద్దేందుకు చైనా, వియ‌త్నాం వం టి దేశాల్లో అధ్యయన పర్యటన లు చేపట్టాలని, జైపూర్ సిటీతో పో టీ ప‌డేలా హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర ప్రాంతాలను ‘వెడ్డింగ్ డెస్టినే షన్స‌గా తీర్చిదిద్ద‌డం,కేరళ తరహా లో ప్రకృతి ఉత్ప త్తులు, సంస్కృ తి ని ప్రోత్సహించేందుకు ప్ర‌ణాళిక‌లు రూ పొందించ‌డం, ఈత‌, తాటి క‌ ల్లు, ఇత‌ర ఉప ఉత్ప‌త్తుల‌ను ప్రో త్స‌హిస్తూనే బ్రాండింగ్ చేయ‌డం, వారసత్వ విధానం (Heritage policy) ఉండాలని, విదేశీయుల కంటే భారతీ యులే పర్యాటకానికి ఎక్కువ ఖర్చు చేస్తారు, కాబట్టి స్వదేశీ పర్యాటకంపై దృష్టి పెట్టి తెలంగాణ ప‌ర్యాట‌క ప్ర‌మోష‌న్, బ్రాండింగ్ పై ప్ర‌త్యేక దృష్టి సారించి, ప్ర‌చారానికి నిధులు కే టాయించా లి, మధ్యప్రాచ్యం (Middle East) నుండి పర్యా టకులను ఆక‌ర్శించ‌డం వంటి అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని ప్ర‌ తిపాదించారు.

వరంగల్, సోమశిల వంటి ప్రాంతా ల్లో ప్రైవేట్ భాగస్వా మ్యంతో 3 నుండి 5స్టార్ హోటళ్లను నిర్మించ‌డం,బమ్మెరలో పోతన స్మృతి వ నం నిర్మాణ పనుల్లో వేగం పెంచాల‌ని, వ‌ రంగ‌ల్ హ‌రిత హోట‌ల్ నుంచి రామ‌ప్ప వ‌ర‌కు బ‌స్సు స‌ర్వీ సుల‌ను న‌డ‌పాల‌ని క‌మిటీ స‌భ్యులు సూచించారు. ఈ స మావేశంలో ప‌ర్యాట‌క అభి వృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్ట‌ర్ గౌత‌ మి, డైరెక్ట‌ర్ ఆఫ్ టూ రింజం ల‌క్ష్మ‌ణ్ రంజిత్ నాయ‌క్, క మిటీ సభ్యులు పాపారావు (IAS), కమలవర్ధన్ రావు (IA S), డాక్టర్ బాలాజీ, జుల్ఫీ, మార్గ్ పటేల్, రాం దేవ్ రావు తది తరులు పాల్గొన్నా రు.

Related Articles

Back to top button