Tpcc hot comments on mla Rajgopal reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ కాంగ్రెస్‌లో అంతర్గత పరి ణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యత లు మరియు పార్టీ భవిష్య త్ కార్యాచరణపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కు మార్ గౌడ్ జరిపిన మీడియా చిట్ చాట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకె త్తిస్తోంది. ఒకవైపు సొంత పార్టీ నేతలకు క్ర మశిక్షణ హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు విపక్ష బీఆ ర్ఎస్ వైఫల్యాలను ఎండగ డుతూ స్పష్టమైన రోడ్‌మ్యా ప్ ను వివరించారు. మునుగోడు ఎమ్మెల్యే ‘రాజగోపాల్ రెడ్డి’ ఫ్రెండ్‌షిప్ ఓకే.. పార్టీ లైన్ దాటితే నో కాంప్ర మైజ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రె డ్డి చేసిన బహిరంగ వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ గట్టి సందేశాన్ని పంపారు.
హైకమాండ్ సీరియస్ నజర్
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టా నం ఇ ప్పటికే సీరియస్‌గా పరిగణించిందని స్పష్టం చేశారు. ఆవేదన తెలుసు.. కానీ “రాజగోపాల్ రెడ్డి నాకు మంచి మి త్రుడు. ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నాం. కానీ, పార్టీ వేదికలు కాదని బ హిరంగంగా మాట్లాడటం ఏమాత్రం సమ ర్థనీయం కాదు” అని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రయో జనాలే ప్రథమ ప్రాధాన్యత అని, లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వా రై నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పదవుల పంపకాల్లో ’60:40′ ఫార్ములా
రాష్ట్రంలో త్వరలో భర్తీ కానున్న కార్పొరేషన్ చైర్మన్ పదవు లపై పీసీసీ చీఫ్ కీలక ప్రకటన చేశారు: కష్టపడి పనిచేసిన పాత నాయకులకు 60 శాతం, పార్టీలోకి కొత్తగా వచ్చిన నేత లకు 40 శాతం పదవులు కేటాయించనున్నారు.సమర్థత, పార్టీ పట్ల నిబద్ధత ఉ న్నవారికే పదవుల్లో ప్రాధాన్యత ఉం టుందని తెలిపారు.
కేసీఆర్ చేసిన ‘అప్పుల పాపం’
గత బీఆర్ఎస్ పాలనపై విరుచు కుపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థి తిని విశ్లేషించారు. రాష్ట్రానికి గు దిబండగా అప్పులు పరిణమిం చాయని, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి న పాపం ముమ్మాటికీ కేసీఆర్‌దేనని, ఈ నిజాన్ని పోచారం లాంటి సీనియర్ నేత లు కూడా అర్థం చేసుకోవాలని సూ చించారు.
2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నో బిల్లులను కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాకే పరిష్కరిస్తున్నామని, నిలిచిపోయిన సీ ఎం రిలీఫ్ ఫండ్ నిధులను విడుదల చేశామని గుర్తుచేశా రు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీ ఆ ర్ఎస్ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని, ప్రజలు తప్పు డు కథనాలను నమ్మవద్దని కోరారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పం పిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తు న్నామని గర్వంగా ప్ర కటించారు. తమిళనాడు, తెలంగాణ రాజకీయ పరిస్థితు లు, పాలనా వ్యూహాలు పూర్తిగా భిన్నమైనవని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన నిర్ణయాల్లో పార్టీ పాత్ర కూడా స్పష్టంగా ఉం టుందని, ప్రభుత్వం–పార్టీ సమన్వయంతో కలిసికట్టుగా ప్ర జా సంక్షేమమే లక్ష్యంగా ముందు కు సాగుతామని మహేష్ కుమా ర్ గౌడ్ స్పష్టం చేశారు.
