
Traffic Restrictions in Nalgonda Town : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ నగరంలో స్కూళ్లు తెరుచు కోబోతున్నాయి. సహజంగానే రోడ్ల పై రోజు రోజుకు రద్దీ పె రుగుతోంది. ఇకపై మీ ప్రయాణం సేఫ్‌గా సాగా లoటేఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవా ల్సిం దే పాటించాల్సిందే.పట్టణంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేం దుకు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నల్లగొండ ట్రాఫిక్ విభాగం సరికొత్త ఆంక్షలను తెరపైకి తెచ్చింది. నల్లగొండ నగ రం ట్రాఫిక్ సీఐ మహా ల క్ష్మయ్య వెల్లడించిన ఆకొత్త నిబం ధనలు, హెచ్చరికల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 8నుండి రాత్రి10వరకు నోఎంట్రీ
నల్లగొండ పట్టణంలోకి లారీలు, ట్రాక్టర్లు వంటి భారీ వాహనా లు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇకపై వీల్లేదు. ఉ దయం8:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు భా రీ వాహనాల రాకపో కల పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు
ఈ సమయం దాటి నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం భారీ జరిమా నాలతో పాటు చట్టపరమైన చర్య లు తప్పవని సీ ఐ స్పష్టం చేశారు.
అదే సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఆపితే అంతే సం గతులు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్లపై ట్రా ఫిక్‌కు అంతరా యం కలిగిస్తూ ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపేవారికి పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాహన దా రులు రోడ్డుపై క్రమశిక్షణతో డ్రైవ్ చేయాలని సూచిస్తున్నా రు.ఎక్కడ పడితే అక్కడ వాహనాల ను పార్క్ చేస్తే కఠిన చర్యలు ఉం టాయని హెచ్చరిస్తున్నారు.
అలాఅయితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిపై పోలీసులు ‘స్పెషల్ డ్రైవ్’ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ కింది ఉల్లంఘనలపై నిఘా పెట్టారు.
1. **మద్యం సేవించి వాహనం నడపడం (Drink and Drive)**
2. **పరిమితికి మించిన అతివేగం (Over Speedi ng)**
3. **అనధికారిక పార్కింగ్ (Illegal Parking)**
ఎవరైతే ఈ రూల్స్ అతిక్రమిస్తే కేవలం ఫైన్‌తో వదిలిపెట్టే ప్ర సక్తే లేదని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహ నా లను సీజ్ చేస్తామని naklagobd ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య హెచ్చ రిస్తున్నారు.మీ నిర్లక్ష్యపు డ్రై వింగ్ వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదని, ప్ర తి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని, సురక్షితమైన నల్ల గొండ కోసం ప్రతి ఒ క్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సీఐ కోరుతున్నారు.




