wedding ceremony: వివాహ వేడుకలో విషాదం
-- అగ్ని ప్రమాదంలో వంద మంది ఆహుతి -- రెండొందల మంది వరకు క్షతగాత్రులు
వివాహ వేడుకలో విషాదం
— అగ్ని ప్రమాదంలో వంద మంది ఆహుతి
— రెండొందల మంది వరకు క్షతగాత్రులు
ప్రజా దీవెన/ఇరాక్: శుభకార్యం లో అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో జరిగిన అకస్మాత్తు ప్రమాదంలో వారి ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది మరణాలు అంతకుమించి క్షతగాత్రులు క్షణాల్లోనే కళ్ళ ముందు కనబడిన హృదయ విదారక సంఘటన ఇరాక్ లో చోటు చేసుకుంది.
ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా జిల్లాలో వివాహ వేడుకలో విషాద సంఘటనైనా అగ్నిప్రమాదంలో కనీసం 100 మంది మరణించగా సుమారు 200 మందివరకు తీవ్రంగా గాయపడ్డారు.
అత్యంత విషాదకరమైన సంఘటనగా ఇరాక్ వార్తా సంస్థల సమాచారం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులలో చాలామంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.
వివాహ వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చిన సందర్భంలో ఆ పక్కనే ఉన్న పెద్ద ఈవెంట్ హాల్‌లో మంటలు చెలరేగడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగిందని ప్రకటించాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలతో బయటపడినా భవనం యొక్క కాలిపోయిన శిధిలాల మీదకి దూసుకుపోతున్నట్లు చూపించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం భవనం అత్యంత మంటలకు ఆస్కారమిచ్చే నిర్మాణ సామగ్రితో నిర్మించబడిందని బాణాసంచా పేలుళ్లతో చెలరేగిన మంటలు వేగంగా చుట్టుముట్టి కూలిపోవడానికి కారణమైందని విచారం వ్యక్తం చేశారు.
అధికారిక ప్రకటనల ప్రకారం ఇరాక్ కు చెందిన సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు, అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన వైద్య సహాయక చర్యలకు ఉపక్రమించాయి.