
Tragedy family sucaid rajahmundry godavari bridge : ప్రజా దీవెన, రాజమండ్రి: ఆంధ్ర ప్రదేశ్ లోని రాజ మండ్రి వద్ద గోదావరి నది ఒక్కసారిగా శోకసంద్రంగా మారిం ది. కుటుంబ కలహాలా.. క్లిష్ట పరిస్థితులా.. కారణం ఏదైనా, ఓ ఇంజినీరింగ్ అధికారి కుటుంబం తీసుకున్న తీవ్ర నిర్ణ యం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పంచాయతీరాజ్ విభా గంలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏ ఈ)గా పనిచేస్తున్న నూ కరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, చిన్నారి మ నవడితో కలిసి గోదావరి వంతెన వద్దకు చేరుకున్నారు. అ నంతరం నలుగురూ నదిలోకి దూకినట్లు సమాచారం.
ఘటనను గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పం దించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలోకి దూకి, నీ టిలో కొట్టుకుపోతున్న చిన్నారి మనవడిని సురక్షితంగా ఒ డ్డుకు చేర్చారు. దీంతో ఆచిన్నారి ప్రాణాలతో బయటపడ్డా డు.అయితే నూక రా జు, మీనా, సౌజన్య మాత్రం నది ప్ర వాహంలో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం పోలీ సు లు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. బోట్లు, గజ ఈ తగాళ్ల సహాయంతో గోదావరి పరిసరా ల్లో విస్తృతంగా గా లింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఓ అధికారి కు టుంబం ఇలాంటి నిర్ణయం తీసుకోవ డం స్థానికులను తీవ్ర దిగ్భ్రాం తి కి గురిచేసింది. ముఖ్యంగా ప్రాణాలతో బయట పడిన చిన్నారి అమాయక చూపులు అక్కడు న్న ప్రతి ఒక్క రినీ కంటతడి పెట్టిం చాయి.ఒక్క క్షణం నిర్ణయం.. ఓ కుటుం బాన్ని విషాదంలోకి నెట్టిం ది. అసలు ఈ ఘటన వెనుక కార ణమేంటి? అనే ప్రశ్నలకు స మాధానాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మానసిక ఆందోళన లేదా తీవ్ర సమస్యలు ఎదు రైనప్పుడు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యు లు, స్నేహితులు లేదా నిపుణులను సంప్రదిం చండి. భారత దేశంలో టెలి-మా నస్ 14416 ద్వారా మానసిక ఆరోగ్య సహాయం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.




