Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 8:45 am Posted by : praja deveena

Tragedy strikes Miryalaguda : నల్లగొండ జిల్లా బ్రేకింగ్, మనవడి కోసం ‘ప్రాణత్యాగం’ ఊట్లపల్లి బో రుబావి రెస్క్యూ ఆపరేషన్‌లో వి షాదాంతం!

Tragedy strikes Miryalaguda in Nalgonda : ప్రజా దీవెన,మిర్యాలగూడ: అది ఒక సాధారణ సాయంత్రం కానీ, ఆ గ్రామానికి మాత్రం ఒక ఊహిం చని గుండెకోతను మిగి ల్చింది. మిర్యా లగూడ మండలం ఊట్లపల్లి శివారులో జరి గిన ఒక హృదయ విదారక ఘటన, అటు రెస్క్యూ సిబ్బం ది ని, ఇటు యావత్ నల్లగొండ జిల్లాను కన్నీరు పెట్టించింది. నా లుగేళ్ల పసికందు ఆడుకుంటూ వెళ్లి, అ క్కడ తెరిచి ఉన్న నో రులాంటి ఒక బోరు గుంతలో ప్రమాదవశాత్తు పడిపో యా డు. గమనించిన తాత వెంకన్న గుండె ఒక్కసారిగా ఆగి పో యినంత పనైంది. “నా మనవడు నాకు కావాలి” అంటూ చుట్టూ ఉన్నవాళ్లు వారించేలోపే, ఏమాత్రం ఆలోచించకుం డా ఆ బోరు గుంతలోకి దిగిపోయాడు.

కానీ లోపలికి వెళ్లేకొద్దీ ఊపిరాడలే దు. అటు పసివాడి ఏడుపు.. ఇ టు ఊపిరి సలపని గాలి చివరకు ఆ లోతైన గుంతలో తాతా మనవ డు ఇద్దరూ ఇరుక్కుపోయారు. క్ష ణాల్లో ఈ వార్త దావానలంలా వ్యా పించడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు రేగాయి.

ఉత్కంఠతలో ఊపిరిబిగబట్టిన రెస్క్యూ ఆపరేషన్

స్థానికుల సమాచారంతో మిర్యాల గూడ రూరల్ పోలీసు లు, రెస్క్యూ సిబ్బంది మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జెసిబిలు వచ్చాయి ఆక్సిజన్ పైపులు లోప లికి వెళ్లాయి. కాలం కరుగుతోంది.. లోపల ప్రాణాలు కొట్టు మిట్టాడు తున్నాయి.. గంటల తరబడి సాగి న ఈ ఆపరేష న్‌లో రెస్క్యూ టీం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరా డిం ది.ఎట్టకేలకు సిబ్బంది తీవ్రంగా శ్రమిం చి, ఆ నాలుగేళ్ల చి న్నారిని సురక్షి తంగా, ప్రాణాలతో బయటకు తీశారు. ఊపి రి పీల్చుకునే లోపే అసలు విషాదం ఎదురైంది. బోరుబావి లో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న పరిస్థితి అప్పటికే అత్యంత విషమంగా మారింది. రెస్క్యూ సిబ్బంది ఆయనను వెంట నే ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తర లిస్తుం డగా మార్గమధ్యంలోనే ఆ వృద్ధుడి శ్వాస ఆగిపోయింది. మ నవడికి పునర్జన్మను ఇచ్చి, తాత అనంత లోకాలకు వెళ్లిపోయాడు. తన ప్రాణం పోయినా పర్లేదునా వంశాంకు రం బతకాలి” అనుకు న్న ఆతాత త్యాగం ముందు చావు కూ డా చిన్నబోయింది. ప్రస్తుతం ఊట్లపల్లి గ్రామం కన్నీరు మున్నీరవుతోంది. కంటిపాపలాంటి కొడుకు బతికాడన్న ఆ నందం ఒకవైపు.. కు టుంబానికి పెద్ద దిక్కులాంటి తండ్రి ఇక లేడన్న రోదనలు మరోవైపు ఆ కుటుంబాన్ని ముంచెత్తాయి. కాగా, ప్రాణాలకు తెగించి చిన్నారి ప్రాణా లు కాపాడిన మి ర్యాలగూడ రూరల్ పోలీసులను, రెస్క్యూ సిబ్బందిని ప్రజ లు కన్నీటితో అభినందిoచకుండా ఉండలేకపోయారు.